భారత స్టార్ షట్లర్, ఒలంపిక్స్ పతకాల విజేత పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మరోమారు తన సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో ఏకైక భారతీయ షెట్లర్ సింధు. 2019లో బెసెల్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలలో సింధు ప్రపంచ ఛాంపియన్ గా అవరించింది. అయితే గత ఏడాది జరగాల్సిన బీడబ్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు కరోనా మహమ్మారి కారణంగా రద్దు చేయబడిన విషయం తెలిసిందే.
కాగా తాజాగా నిర్వహిస్తున్న బీడబ్యూఎప్ పోటీలలో సింధూ క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. థాయ్‌ల్యాండ్ కు చెందిన పాన్‌పావీ చోచువాంగ్‌పై విజయం సాధించి క్వార్టర్స్ చేరింది. రౌండ్-3 మ్యాచ్లో వీళ్లిద్దరూ తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో 21-14, 21-18తో వరుస సెట్లలో గెలిచిన సింధు.. చోచువాంగ్‌ను మట్టికరిపించింది. మొత్తం 48 నిమిషాలపాటు ఈ మ్యాచ్ జరిగింది. ఇంతకుముందు వీళ్లిద్దరూ ఆడిన చివరి రెండు మ్యాచుల్లోనూ సింధు ఓటమిపాలైంది. ఇదిలావుండగా క్వార్టర్స్‌లో ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్ మెడల్ ను అందుకున్న సింధూ క్వార్టర్ ఫైనల్స్ లో చైనీస్ తైపీ తైజు యింగ్‌తో తలపడనుంది. స్కాల్యాండ్ కు చెందిన క్రీడాకారిణి క్రిస్టీ గిల్మోర్ ను 21-10, 19-21, 21-11 ఓడించింది.
(And get your daily news straight to your inbox)
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more
Nov 30 | ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్లో షాకింగ్ ఘటన జరిగింది. టోర్ని నిర్వహకులు ఏకంగా మ్యాచ్ నే రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎంత హాకీ మన జాతీయ క్రీడ అయినా.. ప్రత్యర్థి జట్టుపై ఆటలో... Read more
Nov 26 | జూనియర్ హాకీ ప్రపంచ కప్‌లో భారత హాకీ జూనియర్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి మ్యాచ్ లో ఫ్రాన్స్ చేతిలో పరాభవం ఎదురుకావడాన్ని జీర్ణంచుకోలేని జట్టు.. తన రెండో మ్యాచ్ లో... Read more
Oct 21 | డెన్మార్క్ ఓపెన్‌లో భారత సీనియర్ షట్లర్, భారత డబుల్ ఒలింపిక్ పతక విజేత సూపర్ స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రత్యర్థితో జరిగిన మూడు గేమ్‌లలో దూసుకుపోయింది. సింధు... Read more
Aug 27 | టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటి బంగారు పతకంతో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న భారత జావెలిన్ త్రో చాంఫియన్ గా అవతరించిన నీరజ్ చోప్రా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బ్రేక్ తీసుకుంటానని ఈ... Read more