china open pv sindhu defeats chinas li xuerui చైనా ఓపెన్ లో పివీ సింధు ఆరంభం అదుర్స్

China open pv sindhu defeats li xue rui to reach pre quarterfinals

PV Sindhu, Sai Praneeth, China Open, PV Sindhu China Open, Saina Nehwal, PV Sindhu, World champion PV sindhu, Sindhu, badminton news, sports news, badminton, sports

Newly crowned World Champion PV Sindhu continued her winning run at China Open as she defeated the former world No.1 China's Li Xue Rui in straight games (21-18, 21-12) to qualify for the round of 16.

చైనా ఓపెన్ లో పివీ సింధు ఆరంభం అదుర్స్

Posted: 09/18/2019 09:51 PM IST
China open pv sindhu defeats li xue rui to reach pre quarterfinals

ప్ర్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ పీవీ సింధు బుధవారం చైనా ఓపెన్‌‌ని ఘన విజయంతో ఆరంభించింది. చైనాలోని చాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ‘చైనా ఓపెన్ సూపర్ 1000’ బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్‌లోనే లండన్ ఒలింపిక్స్ విజేత లీ జురుయ్‌ని 21-18, 21-12 తేడాతో వరుస సెట్లలో పీవీ సింధు చిత్తుగా ఓడించేసింది. ఈ మ్యాచ్‌ ముందు వరకూ మొత్తం ఆరు సార్లు తలపడిన ఈ ఇద్దరు షట్లర్లు చెరొక మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందారు.

కానీ తాజా విజయంతో పీవీ సింధు 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చైనాకి చెందిన లీ జురుయ్‌ తొలుత పీవీ సింధూకి గట్టి పోటీనిచ్చేలా కనిపించింది. కానీ.. ఇటీవల స్విట్జర్లాండ్ వేదికగా ముగిసిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన సింధు దూకుడు ముందు జురుయ్ తేలిపోయింది. కేవలం 34 నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్‌ని గెలుపుగా ముగించేసిన పీవీ సింధు.. ప్రీక్వార్టర్‌లోకి దూసుకెళ్లింది.

ఈ టోర్నీలోనే భారత మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఫస్ట్ రౌండ్‌లో పేలవ ఓటమితో ఇంటిబాట పట్టింది. థాయ్‌లాండ్‌కి చెందిన బుసావన్‌తో ఈరోజు ఢీకొట్టిన నెహ్వాల్ 10-21, 17-21 తేడాతో వరుస సెట్లలో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ 44 నిమిషాల్లో ముగిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  World champion PV sindhu  Sindhu  China open  saina Nehwal  badminton  sports  

Other Articles

Today on Telugu Wishesh