Sunil Chhetri thanks fans for big win over Kenya కెప్టెన్ పిలుపుకు తరలిన అభిమానం..

Sunil chhetri s plea to come watch football does wonders

india vs kenya, Indian football, Sunil Chhetri, Intercontinental Cup, football fans, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian football, indian football news, sports news,sports, latest sports news, cricket

Captain Chhetri scored a brace in his 100th international match as India beat Kenya 3-0 to seal their final berth of the four-nation Intercontinental Cup with one match to go against New Zealand.

కెప్టెన్ పిలుపుకు తరలిన అభిమానం..

Posted: 06/05/2018 07:47 PM IST
Sunil chhetri s plea to come watch football does wonders

అటగాళ్లపై ఫాన్సుకు ఉండే అభిమానాన్ని ఏ కొలమానం కొలవలేదని పెద్దలు చెప్తారు. తమ అభిమాన ఆటగాళ్లు ఎదురైతే పరిగెత్తుకొచ్చి పాదాభివందనం చేసిన ఘటనలు, అటు మైదానంలోనూ అటకు బ్రేక్ వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలను చూస్తుంటాం. అయితే ఇవి కేవలం క్రికెట్ మాత్రమే పరిమితం కాలేదు. ఇలాంటి ఘటన తొలిసారిగా ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ కూడా లో చోటు చేసుకుంది. ముంబై ఫుట్ బాల్ ఎరీనా వేదికగా టీమిండియా, కెన్యా మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఓ అభిమాని మైదానంలోకి వచ్చి కెప్టెన్ సునీల్ ఛేత్రీకి పాదాభివందనం చేశాడు.

ఆ వెంటనే సునీల్ తో కలిసి సెల్ఫీ దిగేందుకు కూడా ప్రయత్నించాడు. కానీ అతని అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించిన కెప్టెన్, తరువాత అతన్ని కలువమని పేర్కొన్నాడు. వెంటనే సదరు అభిమానిని పట్టుకొనేందుకు భద్రతా అధికారులు పరిగెత్తుకు వచ్చారు. కానీ సునీల్ అతన్ని ఏమి అనవద్దని వాళ్లకు సూచించాడు. అంతకుముందు చైనీస్ టైపీతో జరిగిన మ్యాచ్లో భారత జట్టుకు తక్కువ ప్రజాధరణ లభించింది.
 
కేవలం 2,500 మంది మాత్రమే ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు స్టేడియంకి వచ్చారు. దీంతో అవేదనకి గురైన కెప్టెన్ ఛేత్రీ సోషల్ మీడియా వేదికగా తమ మ్యాచులు వీక్షించాలని అభిమానులను కోరాడు. కనీసం తమని తిట్టడానికైన మైదానానికి రావాలని పేర్కొన్నాడు. సునీల్ అభ్యర్థనకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా పలువురు సునీల్ కు సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలిపారు.

దీంతో నిన్నటి మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులతో స్టేడియం మొత్తం నిండిపోయింది. ప్రేక్షకాధరణనను చూసిన సునీల్ మళ్లీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ‘దేశం తరఫున ఆడిన ప్రతిసారి అభిమానుల నుంచి ఇదే తరహా మద్దతు దక్కితే మైదానంలో ప్రాణాలు వదలడానికైనా మేము సిద్ధమే. ఈ రోజు రాత్రి ఎంతో ప్రత్యేకం. గ్యాలరీ నుంచి కేకలు వేస్తూ, కేరింతలు కొడుతూ మాకు మద్దతు తెలిపిన మీ అందరికీ ధన్యవాదాలు’ అని ఛెత్రి పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs kenya  Indian football  Sunil Chhetri  Intercontinental Cup  football fans  sports  

Other Articles