Bajrang Punia storms to wrestling gold రెజ్లింగ్ లో స్వర్ణంతో మెరిసిన భజరంగ్..

Cwg 2018 bajrang punia storms to wrestling gold silver for pooja dhanda

Bajrang Punia, vincent de marinis, meisam nassiri, kane charig, Pooja Dhanda, cwg 2018, Asian Indoor and Martial Arts Games, CommonWealth Games, wrestler, Gold Coast, Australia

India's gold rush at the 2018 Commonwealth Games has continued with Bajrang Punia delivering a 17th yellow metal in the men's freestyle 65kg while Pooja Dhanda has won silver in the women's 57kg freestyle on day nine of competition at Gold Coast, Australia.

కామన్వెల్త్ గేమ్స్: రెజ్లింగ్ లో స్వర్ణంతో మెరిసిన భజరంగ్..

Posted: 04/13/2018 05:50 PM IST
Cwg 2018 bajrang punia storms to wrestling gold silver for pooja dhanda

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న 21వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే గత స్వర్ణ పతకాల రికార్డులను తిరగరాస్తూ.. ఇప్పటికే 15 స్వర్ణాలతో వున్న గ్లాస్కో రికార్డును బద్దలు కోట్టిన భారత క్రీడాకారులు మరింత జోరుతో దూసుకెళ్తున్నారు. భారత్ అథెట్లు అస్ట్రేలియా కామన్వెల్త్ గేమ్స్ లో పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా ఇవాళ జరిగిన పురుషుల రెజ్లింగ్ పోటీల్లో రెజ్లర్ భజరంగ్ పూనియా బంగారు పతకం గెలుచుకున్నాడు. 65 కిలోల విభాగంలో వేల్స్‌ క్రీడాకారుడు కానే చారిగ్‌పై పైచేయి సాధించిన 24 ఏళ్ల భజరంగ్ పూనియా... భారత్‌కు 17వ స్వర్ణపతకం అందించాడు.
 
మరోవైపు మహిళ రెజ్లింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించాలనుకున్న పూజా ధండాకి నిరాశ ఎదురైంది. 57 కిలోల విభాగం ఫైనల్స్‌లో నైజీరియా రెజ్లర్ ఒడునయో చేతుల్లో 6-1 తేడాతో పరాజయం పొంది సిల్వర్‌తో సరిపెట్టుకుంది. 68 కిలోల విభాగంలో దివ్య కరణ్ కాంస్య పతకం సాధించింది. కాగా మెన్స్ 97 కిలోల విభాగంలో మౌసమ్ ఖాత్రి రజత పతకం గెలుచుకున్నాడు. సౌతాఫ్రికాకి చెందిన మార్టిన్ ఎరాస్‌మస్ చేతుల్లో పరాజయం పొందడంతో ఖాత్రి తృటిలో బంగారు పతకం చేజార్చుకున్నాడు. కాగా తాజా కామన్వెల్త్ పోటీల్లో భారత రెజ్లర్లు ఇప్పటి వరకు 8 పతకాలు సాధించడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Common Wealth Games  wrestler  Bajrang Punia  Pooja Dhanda  India  gold medals  sports  

Other Articles