Saina wants to skip asia team championship, వెళ్లలేనన్న సైనా.. వెంటపడి ఒప్పిస్తామన్న బాయ్

Saina wants to skip asia team championship bai reluctant to let go

HT2017, Badminton News, Badminton, Saina Nehwal, ruthvika gaade, Krishna Priya, BAI, Badminton Association of India, Asia Team Championship, anup narang, sports news, sports news, latest sports news, latest news

Saina Nehwal wants to skip next month's Asia Team Championship to prepare for the All England Championship but the Badminton Association of India (BAI) is trying to convince the Indian ace to play the event,

వెళ్లలేనన్న సైనా.. వెంటపడి ఒప్పిస్తామన్న బాయ్

Posted: 01/24/2018 08:27 PM IST
Saina wants to skip asia team championship bai reluctant to let go

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 టోర్నీకోసం జకార్తలో పర్యటిస్తోంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు మలేసియాలో జరిగే ఆసియా టీం ఛాంపియన్ షిప్ లో తాను పాల్గొనలేనని తెలుపుతూ తాజాగా సైనా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్‌)కు లేఖ రాసింది. ఐతే బాయ్‌ మాత్రం ఛాంపియన్ షిప్ లో ఆడించేందుకు సైనాను వదులుకోవాలని అనుకోవట్లేదు.

ఇందుకు కారణం లేకపోలేదు. థామస్‌, ఉబర్‌ కప్ ఫైనల్స్ మే 20-27 మధ్య జరగనున్నాయి. ఈ టోర్నీల్లో ఆడాలంటే భారత్ ఆసియా టీం ఛాంపియన్ షిప్ లో అద్భుత ప్రదర్శన కనబరచాలి. ఇందుకోసం పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కృష్ణ ప్రియ, రుత్విక గద్దెతో కూడిన మహిళల జట్టును పంపాలని బాయ్ అధికారులు భావిస్తున్నారు. ఐతే మార్చి 14-18 మధ్య జరిగే ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనాలని సైనా భావిస్తోంది.

దీంతో ఈ టోర్నీకి సిద్ధమయ్యే క్రమంలోనే తాను మలేసియా ఛాంపియన్ షిప్ లో ఆడలేనని పేర్కొంటూ లేఖ రాసింది. దీంతో బాయ్ నిర్వాహకులు ఆలోచనలో పడ్డారు. ఈ విషయమై సైనాతో చర్చించి.. ఆమెను ఛాంపియన్ షిప్ లో ఆడేందుకు ఒప్పిస్తామని తెలిపింది. మరి బాయ్ ప్రతిపాదనకు సైనా ఒక మెట్టు దిగి వస్తుందా లేదా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వేచి ఉండాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  Asia Team Championship  BAI  Badminton  sports  

Other Articles

Today on Telugu Wishesh