అంతర్జాతీయ స్కీయింగ్ కాంపిటీషన్ లో రజత పతకం గెల్చినందుకుగాను భారత క్రీడాకారిణి ఆంచల్ ఠాకూర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పొగిడారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈ పోటీల్లో భారతదేశానికి మొదటిసారి పతకం సాధించి దేశఖ్యాతి ఇనుమడింపజేసిందని ప్రధాని పేర్కొన్నారు. టర్కీలోని పాలందోకెన్ స్కీ సెంటర్లో జరిగిన ఆల్పైన్ ఎయ్డర్ 3200 కప్ పోటీల్లో ఆంచల్ రజత పతకం సాధించింది.
ఈ పోటీలను ఫెడరేషన్ ఇంటర్నేషనలె దె స్కీ సంస్థ నిర్వహించింది. 'అంతర్జాతీయ స్కీయింగ్‌లో పతకం సాధించినందుకు సంతోషం. టర్కీలో నువ్వు సాధించిన చారిత్రక విజయానికి దేశం గర్విస్తోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాను' అని మోదీ ట్వీట్ చేశారు.
Well done @alleaanchal for winning an international medal in skiing! The entire nation is ecstatic on your historic accomplishment at the FIS International Skiing Competition in Turkey. Wishing you the very best for your future endeavours.
— Narendra Modi (@narendramodi) January 10, 2018
(And get your daily news straight to your inbox)
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more
Dec 16 | భారత స్టార్ షట్లర్, ఒలంపిక్స్ పతకాల విజేత పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మరోమారు తన సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో... Read more
Nov 30 | ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్లో షాకింగ్ ఘటన జరిగింది. టోర్ని నిర్వహకులు ఏకంగా మ్యాచ్ నే రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎంత హాకీ మన జాతీయ క్రీడ అయినా.. ప్రత్యర్థి జట్టుపై ఆటలో... Read more