భారత్‌కు రెండు ఒలింపిక్ పతకాలు అందించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) నోటీసులు జారీ చేసింది. డిసెంబరు 29న కామన్వెల్త్ క్రీడల రెజ్లింగ్ సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా సుశీల్, మరో రెజ్లర్ రాణా మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై వివరణ కోరుతూ డబ్ల్యూఎఫ్‌ఐ తాజాగా సుశీల్‌కు నోటీసులు జారీ చేసింది.
ఘర్షణపై పర్వీన్ రాణా డబ్ల్యూఎఫ్‌ఐను ఆశ్రయించాడు. దీనికి స్పందించిన అధికారులు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేదంటే తదుపరి చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంటూ సుశీల్‌కు నోటీసులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే.. కామన్వెల్త్ క్రీడల రెజ్లింగ్ సెలక్షన్ ట్రయల్స్ డిసెంబరు 29న దిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఆ సమయంలో రెజ్లర్లు సుశీల్ కుమార్, పర్వీన్ వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఇండోర్ స్టేడియం రణరంగంగా మారింది. సుశీల్ సెమీఫైనల్లో రాణాపై విజయం అనంతరం గొడవ మొదలైంది.
సుశీల్‌తో పోటీపడేందుకు సాహసించినందుకు తనను, తన అన్నను అతడి మద్దతుదారులు కొట్టారని రాణా ఆరోపించాడు. బౌట్ సందర్భంగా రాణా తనను కొరికాడని సుశీల్ చెప్పాడు. ఐతే ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో పాల్గొంటే తనను చంపుతామంటూ సుశీల్ మద్దతుదారులు బెదిరిస్తున్నారని రాణా ఆరోపించాడు. ఈ ఘర్షణపై రాణా దిల్లీ పోలీసులకు ఫర్యాదు చేయడంతో వారు సుశీల్‌తో పాటు అతని మద్దతుదారులపై కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more
Dec 16 | భారత స్టార్ షట్లర్, ఒలంపిక్స్ పతకాల విజేత పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మరోమారు తన సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో... Read more