Birmingham to host 2022 Commonwealth Games బర్మింగ్ హామ్ లో 2022 కామన్ వెల్త్ గేమ్స్

Birmingham named as 2022 commonwealth games host city

Commomwealth Games, 2022 Games, Birmingham, Louise Martin, sport, sports news, latest sports news

Birmingham has been chosen as the host venue for the 2022 Commonwealth Games, organisers announced with the Midlands city being the only bidder.

2022 కామన్ వెల్త్ గేమ్స్ కు అతిధ్యమివ్వనున్న బర్మింగ్ హామ్

Posted: 12/21/2017 08:16 PM IST
Birmingham named as 2022 commonwealth games host city

ఇంగ్లండ్ లోని బ‌ర్మింగ్ హామ్ న‌గ‌రం మరో అద్భుతానికి వేదిక కానుంది. అదే 2022 కామన్ వెల్త్ గేమ్స్. ఈ సారి ఈ పోటీలకు నగరం ఆతిథ్య‌మివ్వ‌నుంది. క్లిష్ట‌మైన వేలం పాట త‌ర్వాత బ‌ర్మింగ్ హామ్ ను ఆతిథ్య దేశంగా నిర్ణ‌యిస్తూ కామ‌న్వెల్త్ గేమ్స్ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు లూయి మార్టిన్ ప్ర‌క‌టించారు. ఈ మేరకు ఇవాళ కామన్ వెల్త్ గేమ్స్ కమిటీతో సమావేశమైన ఆయన.. అనంతరం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

వాస్తవానికి ముందుగా నిర్ధేశించిన దాని ప్రకారం 2022 కామ‌న్వెల్త్ గేమ్స్ ద‌క్షిణాఫ్రికాలోని డ‌ర్బ‌న్ న‌గ‌రం వేదికగా నిలవాల్సి వుంది. కానీ వారి ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా ఆతిథ్యం ఇవ్వలేమంటూ డ‌ర్బ‌న్ త‌ప్పుకోవ‌డంతో మ‌రోసారి వేలం పాట నిర్వ‌హించాల్సి వ‌చ్చిందని.. లూయి మార్టిన్ తెలిపారు.

ఈ క్రీడ‌ల‌కు ఆతిథ్యం ఇవ్వ‌డం కోసం నిర్వ‌హించిన వేలంలో బ‌ర్మింగ్ హామ్‌, లివ‌ర్ పూల్ న‌గ‌రాల మ‌ధ్య గ‌ట్టి పోటీ నెల‌కొంది. అయితే చివ‌రికి బ‌ర్మింగ్ హామ్‌కి ఆతిథ్య బాధ‌త్య‌ల‌ను కామ‌న్వెల్త్ ఫెడ‌రేష‌న్ క‌ట్ట‌బెట్టింది. నాలుగేళ్ల‌కు ఒక‌సారి బ్రిటీష్ కామ‌న్వెల్త్ దేశాల మ‌ధ్య ఈ పోటీలు జ‌రుగుతాయి. చివ‌రిసారిగా 2014లో యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లోని గ్లాస్గోలో జరిగాయి. 2018 కామ‌న్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలో గోల్డ్‌కోస్ట్‌లో జ‌ర‌గ‌నున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Commomwealth Games  2022 Games  Birmingham  Louise Martin  sport  sports news  latest sports news  

Other Articles