Jitu Rai, Heena Sidhu win gold in air pistol mixed event భారత జోడి శుభారంభం.. మిక్స్ డ్ ఈవెంట్ లో స్వర్ణం..

Jitu rai heena sidhu win gold in 10m air pistol mixed team event at issf world cup

jitu rai, heena sidhu, shooting world cup, india shooting world cup, issf world cup, issf world cup india, Commonwealth Games, sidhu, Shooting, Rai, Jitu, Heena, ISSF World Cup Finals, sports, sports news

Heena Sidhu and Jeetu Rai won Gold in the 10m Mixed Team Air Pistol segment at the ISSF World Cup finals.

భారత జోడి శుభారంభం.. మిక్స్ డ్ ఈవెంట్ లో స్వర్ణం..

Posted: 10/24/2017 08:37 PM IST
Jitu rai heena sidhu win gold in 10m air pistol mixed team event at issf world cup

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌ శుభారంభం చేసింది. 10మీటర్ల పిస్తల్‌ మిక్స్ డ్‌ ఈవెంట్‌లో జీతూ రాయ్‌-హీనా సిద్ధూ జోడీ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఫ్రాన్స్‌ రజత పతకాన్ని కైవసం చేసుకోగా.. చైనా కాంస్యంతో సరిపెట్టుకుంది. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ పోటీలు తొలిసారి భారత్‌ వేదికగా జరుగుతున్నాయి. ఫైనల్‌ పోటీల కోసం జరిగిన క్వాలిఫైయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన జీతూ జోడీ ఆ తర్వాత జరిగిన ఫైనల్‌లోనూ అదే ప్రదర్శన కొనసాగించారు.

దీంతో ఫైనల్లో జీతూ-సిద్ధూ జోడీ 483.4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 481.2 పాయింట్లతో ఫ్రాన్స్‌, 418.2 పాయింట్లతో చైనా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ‘సొంతగడ్డపై స్వర్ణపతకం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. స్వర్ణం గెలిచినప్పటికీ ఇప్పటికీ మాపై ఎంతో ఒత్తిడి ఉంది. సొంత అభిమానులు మధ్య మాపై అంచనాలు పెరిగాయి. దీంతో గతకొద్ది రోజుల నుంచి ఇద్దరం కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాం ’ అని పతకాలు స్వీకరించిన అనంతరం జీతూ-సిద్ధూ జోడీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jitu Rai  Heena Sidhu  Commonwealth Games  sidhu  Shooting  Rai  Jitu  Heena  ISSF World Cup Finals  sports  

Other Articles