Goalkeeper dies after mid-game collision ఆటలోఅపశృతి.. క్రీడాకారుడి మృతి..

Indonesian goalkeeper huda dies after mid game collision

Choirul Huda, Yuhronur Efendi, yudistiro andri nugroho, Persela, Lamongan hospital, Indonesian Football, Indonesian goal keeper, football, Football news, sports news, sports

Indonesian football was in mourning on Monday after celebrated goalkeeper Choirul Huda died following an on-pitch collision with a teammate.

ఆటలో అపశృతి.. క్రీడాకారుడి మృతి.. విషాదంలో ఇండోనేషియా

Posted: 10/16/2017 03:56 PM IST
Indonesian goalkeeper huda dies after mid game collision

అట ఏదైనా.. ప్రమాణాలు పూర్తిగా పాటించి అడుతున్నా.. ప్రమాణాలు పాటించకుండా అడినా.. ప్రమాదాలు మాత్రం అటలో సంభివిస్తూనే వుంటాయి. వాటిని ఊహించడానికి కూడా శక్తి సరిపోదు. అలా ఊహకందని విదంగా అటల్లో ఎన్నో ప్రమాదాలు సంభవించాయి. చివరి క్షణం వరకు ఆట కోసమే అలోచించి తమ జట్టు గెలవాలన్న కాంక్షను కనబర్చే క్రీడాకారులు.. తేరుకునే లోపు జరగరానిదే జరిగిపోతుంటుంది. తాజాగా ఫుట్ బాల్‌ మ్యాచ్‌లో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. సహచర ఆటగాడు బలంగా తాకడంతో గోల్‌ కీపర్‌ మృతి చెందాడు.

పెర్సెలాఎస్ పీ ఎఫ్ సీ మధ్య ఫుట్‌బాల్‌ మ్యాచ్ నిర్వహించారు. పెర్సెలా జట్టుకు గోల్ కీపర్ గా 38 ఏళ్ల చోయ్రుల్‌ హుడా బాధ్యతలు నిర్వహించాడు. ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలి అర్ధభాగం ముగియడానికి సమయం ముంచుకొస్తుండటంతో ఎస్ పీ ఎఫ్ సీ ఆటగాళ్లు దూకుడు పెంచారు. 64వ నంబర్ జెర్సీ ధరించిన మిడ్ ఫీల్డర్ రోమన్ రోడ్రిక్స్ బంతిని గోల్ గా మలిచేందుకు ప్రయత్నించాడు. రోమన్ ను అడ్డుకునేందుకు హుడా ముందుకొచ్చాడు. ఈ క్రమంలో హుడా, రోమన్ బలంగా ఢీకొన్నారు. వెంటనే హుడా అపస్మాకర స్థితిలోకి వెళ్లిపోయాడు.

అప్రమత్తమైన సిబ్బంది స్ట్రెచర్ పై హుడాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రి చేరుకున్న కొద్ది క్షణాల్లోనే అతడు తుదిశ్వాస విడిచాడు. శ్వాస తీసుకోవడంలో హుడా ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో హార్ట్ ఎటాక్ కూడా వచ్చింది. దీంతో అతన్ని మేం కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. 1999 నుంచి హుడా పెర్సెలా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles