Saina Nehwal loses in semis సైనాకు తప్పని ఓటమి.. క్యాంసంతో సరి..!

Saina nehwal loses in semis settles for bronze

world badminton championships, Saina Nehwal, Nozomi Okuhara, Sun Yu, PV Sindhu, Pusarla Venkata Sindhu, Kidambi Srikanth, Carolina Marin, badminton news, sports news, latest sports news, badminton

Saina Nehwal settled for a bronze medal as her impressive run at the World Badminton Championships came to an end after a heart-breaking loss against Rio Olympics bronze medallist Nozomi Okuhara of Japan in the women's singles semi-finals.

సైనాకు తప్పని ఓటమి.. క్యాంసంతో సరి..!

Posted: 08/26/2017 08:03 PM IST
Saina nehwal loses in semis settles for bronze

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరు ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ సెమీ ఫైనల్స్‌ వుమెన్స్‌ సింగిల్స్‌లో భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ నిరాశ పరిచింది. తన ప్రత్యర్థి జపాన్‌ షట్లర్‌ నొజోవా ఒకుహర చేతిలో ఓటమి పాలైంది. ఎన్నో ఆశల మధ్య సెమీస్‌లోకి అడుగుపెట్టిన సైనా.. చివరికి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. తొలి గేమ్‌లో దూకుడు ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకున్న సైనా.. ఆ తర్వాత వరుస గేముల్లో ఓటమి పాలైంది. తొలి గేమ్‌లో 21-12తో విజయం సాధించిన సైనా ఆ తర్వాత 17-21, 10-21తో వరుస గేముల్లో ఓటమి పాలైంది.

తొలుత రెండో గేమ్‌ ఉత్కంఠగా సాగింది. ఇద్దరి మధ్యా ఒకానొక సమయంలో పాయింట్లు సమానమైనప్పటికీ చివరికి ఒకుహరనే పై చేయిగా నిలిచి 21-17 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మూడో గేమ్‌లో ఒకుహర మొదటి నుంచీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దాంతో సైనా 20-10 పాయింట్ల తేడాతో ప్రత్యర్థి చేతిలో సైనా ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో స్కాట్లాండ్‌ క్రీడాకారిణి గిల్‌మార్‌పై విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టిన సైనా.. చివరికి సెమీస్‌లో ఓటమి పాలై కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : world badminton championships  Saina Nehwal  Nozomi Okuhara  PV Sindhu  Jakarta  badminton  

Other Articles