PV Sindhu wins Sportsperson of the Year 2017 పివీ సింధుకు స్పోర్ట్స్ మ్యాగజైన్ అవార్డు

Sindhu gopichand bag sportsperson coach of the year awards

Abhinav Bindra, boxer amir khan, deepa malik, jwala gutta, P V Sindhu, Richa Chadda, Sportsperson of the Year Awards 2017, Sportsperson of the Year charity gala awards, Taapsee Pannu, sports illustrated, sports news, sports

Rio Olympics silver medallist PV Sindhu has been awarded with the Sportsperson of the Year award

పివీ సింధుకు స్పోర్ట్స్ మ్యాగజైన్ అవార్డు

Posted: 07/07/2017 09:53 PM IST
Sindhu gopichand bag sportsperson coach of the year awards

రియో ఒలంపిక్ రజత పతక విజేత, భార‌త ష‌ట్లర్ సంచలనం, తెలుగు బిడ్డ పీవీ సింధుకు స్పోర్ట్స్ మ్యాగజైన్ అవార్డును ప్రధానం చేసింది. అమెతో పాటుగా అతని కోచ్ గోపిచంద్ కు కూడా ముంబైకి చెందిన స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ మేగ‌జైన్ అవార్డులు ప్రదానం చేసింది. సింధుకి స్పోర్ట్స్ ప‌ర్సన్ ఆఫ్ ది ఇయ‌ర్‌, గోపిచంద్‌కి కోచ్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డుల‌ను అంద‌జేసింది. అలాగే మాజీ స్ప్రింట‌ర్ మిల్కా సింగ్‌కు లివింగ్ లెజెండ్ అవార్డు, ఒలింపిక్ స్వర్ణ ప‌త‌క గ్రహీత అభిన‌వ్ బింద్రాకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల‌ను మేగ‌జైన్ ప్రక‌టించింది.

భార‌త క్రికెట్ జ‌ట్టు టెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ కు గేమ్ ఛేంజ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు అందించింది. దీంతో పాటు జూనియ‌ర్ ఇండియ‌న్ హాకీ జ‌ట్టుకు టీం ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డులు అంద‌జేశారు. ముంబైలో జ‌రిగిన ఈ కార్యక్రమానికి న‌టి తాప్సీ హాజ‌ర‌య్యారు. రియో ఒలింపిక్స్ లో వెండి ప‌త‌కం సాధించిన త‌ర్వాత ఈ ఏడాది ప్రథ‌మాంకంలో సింధు స‌య్యద్ మోదీ ఇంట‌ర్నేష‌న‌ల్‌, ఇండియా ఓపెన్ టైటిళ్లను సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pv sindhu  milkha singh  abhinav bindra  sports illustrated  sports  

Other Articles

Today on Telugu Wishesh