Boxer Vikas Krishan Yadav enters Rio Olympic pre-quarterfinals

Boxer vikas krishan advances to pre quarters

vikas krishan yada, vikas, vikas yadav boxer, boxer vikas, boxing, indian boxers, Olympics 2016, Shooting Rio Olympics, rio olympics, boxing, Charles Conwell, latest Olympics 2016 news

Two-time Olympian Vikas Krishan Yadav clearly outclassed the 18-year old Charles Conwell with his speed and excellent combinations.

రియోలో భారత బాక్సర్ మైండ్ గేమ్ అదుర్స్..

Posted: 08/10/2016 09:43 PM IST
Boxer vikas krishan advances to pre quarters

నాలుగేళ్లకు ఒకసారి వచ్చే క్రీడా పండుగ ఒలింపిక్స్ లో భారత్ బాక్సర్ శుభారంభాన్ని చేశాడు. రియో ఒలింపిక్స్లో భాగంగా జరుగుతున్న పోటీలలో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ తన తొలి మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. బాక్సింగ్‌ 75 కిలోల విభాగంలో వికాస్‌ కృష్ణన్‌ తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌ చేరుకున్నాడు. క్రితం రోజున అర్ధరాత్రి తర్వాత జరిగిన పోరులో అమెరికాకు చెందిన చార్లెస్ కాన్‌వెల్‌ పై 3-0 తేడాతో వికాస్ గెలుపొందాడు‌.

తొలి మూడు నిమిషాల్లో ప్రత్యర్ధి పంచ్ లను తప్పించుకుని వరుసగా పాయింట్లు సాధించాడు. వరుసగా మూడు రౌండ్లలో అమెరికన్ బాక్సర్ చార్లెస్ ను తెలివిగా మైండ్ గేమ్ ఆడి దెబ్బకొట్టాడు. అందుకే మూడు రౌండ్లలోనూ కేవలం ఒక్క పాయింట్‌ (29-28, 29-28, 29-28) తేడాతో వికాస్ కృష్ణన్ విజయాన్ని నమోదుచేశాడు. ప్రీక్వార్టర్స్‌లో టర్కీకీ చెందిన సిపల్‌ వండెర్‌తో వికాస్‌ తలపడనున్నాడు. గతంలో ఆసియా గేమ్స్ లో స్వర్ణం సాధించిన వికాస్ పై భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikas Krishan  boxing  Charles Conwell  Rio Olympics  Olympic games  brazil  

Other Articles