Sushil Kumar's Olympic dreams over, Narsingh Yadav set for Rio

Sushil s rio hopes dashed by delhi high court

Sushil Kumar, Narsingh Yadav, Rio Olympics, Indian Wrestling Rio, WFI, Delhi High Court sports news, sports

Sushil Kumar, two-time Olympic medalist and ace wrestler, will not go to the Rio Olympics to participate in the 74 kg weight category.

రియో ఒలంపిక్స్: నర్సింగ్ యాదవ్ కు లైన్ క్లియర్,

Posted: 06/06/2016 06:54 PM IST
Sushil s rio hopes dashed by delhi high court

రియో ఒలింపిక్స్ లోకి ఎలాగైనా వెళ్లాలని భారత రెజ్లింగ్ ఫెడరేషన్ కు వరుస విన్నపాల తరువాత తనకు న్యాయం చేయాలని ఏకంగా ఢిల్లీ హైకోర్టును అశ్రయించిన ఒలంపిక్ రజత పతక విజేత విజయేందర్ సింగ్ అక్కడ కూడా నిరాశే ఎదురైంది. భారత్ తరఫున రెజ్లింగ్ లో పోటీ పడేందుకు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన నర్సింగ్ యాదవ్ కు న్యాయస్థానం లైన్ క్లియర్ చేసింది. ఒలింపిక్స్ కు ఎవరు వెళ్లాలన్న విషయమై ట్రయల్స్ నిర్వహించాలని మరో రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, దాన్ని కొట్టివేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం తీర్పిచ్చింది.

అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనల ప్రకారం, ఒలింపిక్స్ కు వెళ్లేందుకు నర్సింగ్ యాదవ్ అర్హుడని, ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో నర్సింగ్ కాంస్య పతకం గెలవడం ద్వారా, ఒలింపిక్స్ బెర్తును ఖరారు చేసుకోగా, గాయాల కారణంగా ఆ పోటీల్లో పాల్గొనలేకపోయిన సుశీల్, తనకు ఒలింపిక్ చాన్స్ కావాలని, నర్సింగ్ కు, తనకు మధ్య పోటీ పెట్టి ఎవరు గెలిస్తే, వారిని పంపాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushil Kumar  Narsingh Yadav  Rio Olympics  Indian Wrestling Rio  WFI  High Court  

Other Articles