Setback for Sushil Kumar, Name omitted from Wrestling Federation of India's Rio Preparatory camp

Narsingh s rise turns focus on mumbai s wrestling arenas

Sushil Kumar, Narsingh Pancham Yadav, 2016 Rio Olympic Games, Wrestling Federation of India, Rio Preparatory camp, Sonepat, WFI, Sports Ministry, sports news

In yet another setback for Sushil Kumar, the double Olympic-medallist has been omitted from the Wrestling Federation of India's Rio Preparatory camp, which is scheduled to begin in Sonepat from Wednesday,

సుశీల్ కుమార్ బెర్తుపై క్లారీటీ ఇచ్చిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్

Posted: 05/15/2016 06:25 PM IST
Narsingh s rise turns focus on mumbai s wrestling arenas

రియో ఒలింపిక్స్ బెర్తును ఆశించిన భారత రెజ్లర్ సుశీల్ కుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. అతని స్థానంలో మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ను ఎంపిక చేస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్యూఎఫ్ఐ) తాజాగా నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి సోన్పేట్లో భారత రెజ్లింగ్ రియో సన్నాహకాల్లో  ఆరంభమవుతున్న నేపథ్యంలో సుశీల్ కుమార్-నర్సింగ్ యాదవ్ల రియో బెర్తుపై నెలకొన్న వివాదానికి డబ్యూఎఫ్ఐ ఎట్టకేలకు తెరదించింది.

వాస్తవానికి  రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో పాల్గొంటామని ఇద్దరు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ పోటీ పడుతున్నారు. భారత్ తరఫున ఈ కేటగిరిలో సుశీల్ (ఢిల్లీ), నర్సింగ్ (ముంబై) అత్యుత్తమ రెజ్లర్లు కాగా, కేవలం ఒకరికి మాత్రమే ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది.  గతేడాది లాస్‌వేగాస్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గడంతోపాటు టాప్-6లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు.

ఆ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక... మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడకూడదు. గతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పతకాలు తెచ్చానని తనకు ఈసారి మరో అవకావం ఇవ్వాలని సుశీల్ పట్టుబట్టినా.. నిబంధనల ప్రకారం నర్సింగ్ యాదవ్ కు అవకాశం కల్పించారు.

'74 కేజీల విభాగంలో సుశీల్-నర్సింగ్ల మధ్య ట్రయల్స్ నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు అందలేదు. అందుజేత నర్సింగ్ యాదవ్ ను ఈ కేటగిరీ నుంచి రియో సన్నాహకానికి ఎంపిక చేశాం. నిబంధనల మేరకు నర్సింగ్ యాదవ్ ఎంపిక జరిగింది. రాబోవు రోజుల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా?అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ సుశీల్ రియో సన్నాహకాలకు వస్తానంటే కాదనం 'అని డబ్యూఎఫ్ఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushil Kumar  Wrestling  RIO olympics  Narsingh Yadav  

Other Articles