India to win five medals at Rio Olympics, predicts US based Gracenote

Us to win the most medals at rio olympics predicts gracenote

rio olympics, olympics, olympics 2016, olympic flame, olympic torch, olympic flame travel, olympic rio de janeiro, olympics news, olympics

If the Rio Olympics were held today, the United States would win the most medals as well as the most golds, predicts Gracenote.

రియో ఒలంపిక్స్: ఎవరికెన్ని పథకాలు.. అంచనా వేసిన గ్రేస్ నోట్

Posted: 04/29/2016 03:17 PM IST
Us to win the most medals at rio olympics predicts gracenote

ఉన్నఫళ్లంగా రియో ఒలంపిక్స్ జరిగితే భారత్ కేవలం ఐదు మెడల్స్ తో సరిపెట్టుకోవాల్సివస్తుందని అమెరికాకు చెందిన గ్రేస్ నోట్ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఒలంపిక్స్ జరిగిన పక్షంలో అమెరికాయే అందరికంటే అధిక మెడల్స్ సాధిస్తుందని జోస్యం చెప్పంది. అంతేకాదట అత్యధిక మెడల్స్ సాధించడంతో పాటు అందులోనూ అత్యధికంగా ఎక్కువ స్వర్ణ పథకాలనే సాధిస్తుందట. గతంలో 23 పథాకాలను సాధించిపెట్టిన అమెరికా స్మిమ్మర్ మైకెల్ ఫెల్ఫ్స్ ఈ సారి మరో ఐదు బంగారు పథాకాలను, ఒక క్యాంస పథకంతో తన పథకాల జాబితాను 28 తీసుకెళ్తాడని అంచనావేసింది.

మరో 99 రోజుల వ్యవధిలో క్రీడాకారుల అద్భుత ప్రతిభకు దర్ఫణం పట్టే రియో ఒలంపిక్స్ తెరలేగనుండడంతో ఏయే దేశాలు ఎన్నెన్ని పథకాలను సాధిస్తాయన్న అంశంలో అంచనాలు వేసింది గ్రేస్ నోట్. ఈ పర్యాయం కూడా అత్యధికంగా 102 మెడల్స్ తో అమెరికా ముందంజలో నిలుస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. అందులో 42 స్వర్ణం, 29 రజతం, 31 కాంస్య పథకాలు వుంటాయని కూడా అంచనా వేసింది. ఇక అమెరికా తరువాతి రెండో స్థానంలో  చైనా నిలుస్తుందని కూడా గ్రేస్ నోట్ అంచనావేసింది. చైనా 31 స్వర్ణం, 26 రజతం, 22 కాంస్య పథకాలతో రెండోస్థానంలో కొనసాగుతుందని జోస్యం చెప్పింది.

ఇక ఆ తరువాతి స్థానంలో రష్యా నిలుస్తుందని, రష్యా 66 పథాకాలు అందులో 22 స్వర్ణం, 22 రజితం, 22 క్యాంస పథకాలుంటాయని అంచనా వేసిన గ్రేస్ నోట్.. ప్రతిష్టాత్మక రియో ఒలంపిక్స్ కు ఈ పర్యాయం వేదిక కల్పిస్తున్న బ్రెజిల్ కూడా 25 పతకాలను సాధించి రికార్డు నెలకొల్పుతుందని జోస్యం చెప్పింది అందులో 9 స్వర్ణం, 8 రజితం, 8 కాంస్య పథకాలుంటాయని కూడా పేర్కోంది. ఈ సారి కూడా పథకాల పంట పండించుకునేందుకు అమెరికా మూడు ప్రథానమైన విభాగాలలోనే దృష్టిసారించిందని, అవి స్విమ్మింగ్, అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ విభాగాలని కూడా తేల్చిచెప్పింది.

తఇక భారత్ విషాయానికి వస్తే.. గ్రేస్ నోట్ అంచానాలు నిజమైన పక్షంలో భారత్ గత పర్యాయం లండన్ లో జరిగిన ఒలంపిక్స్ కన్న తక్కువ పతకాలనే సాధిస్తుందట. లండన్ లో రెండు రజతం, 4 కాంస్య పథకాలను సాధించిన భారత్ ఈ సారి వాటిలో ఒక పతకాన్ని జార విడుచుకుంటుందని గ్రేస్ నోట్ జొస్యం చెప్పింది, అయితే ఈ సారి భారత్ ఒలంపిక్స్ లో స్వర్ణ పతకం సాధించే అవకాశాలు వున్నాయని కూడా అంచనా వేసింది. లెన్నిస్ మిక్సిడ్ డబుల్స్ విభాగంలో స్వర్ణం సాధించే అవకాశాలు వున్నాయని అంచనా వేసిన గ్రేస్ నోట్.. మహిళల అర్చరీ, బాక్సర్ శి తప్ప, షూటర్ జితు రాయ్, షూటింగ్ మహిళలు డబుల్స్ విభాగాల్లో భారత్ పథాలను సాధించవచ్చని పేర్కోంది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rio olympics  brazil  america  china  russia  gracenote  preditions  India  

Other Articles