Saina Nehwal Nominated for BWF Player of Year Award

Saina nehwal nominated for bwf player of year award

Badminton world Federation, Bao Yixin, BWF, Chen Long, Saina Nehwal, Saina nominated for BWF women of the year, Yong Dae, Yoo Yeon Seong, Zhang Nan, Zhao Yunlei

Saina Nehwal- 2 Indian Badminton player Saina Nehwal got nominated for the Badminton World Federation (BWF) Woman Player of the year Award

సైనాను ఉత్తమ క్రీడాకారిణిగా ప్రతిపాదించిన బిడబ్యూఎఫ్

Posted: 12/05/2015 05:35 PM IST
Saina nehwal nominated for bwf player of year award

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఈ ఏడాది ‘ఉత్తమ మహిళా క్రీడాకారిణి’ అవార్డుకు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ స్థానాన్ని సాధించిన భారత స్టార్ షెట్లర్  సైనా నెహ్వాల్ పేరును ప్రతిపాదించింది. సీజన్‌లో నిలకడైన ప్రదర్శనతో పాటు నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించినందుకు ఈమె పేరును సిఫారసు చేస్తున్నట్లు సమాఖ్య ప్రకటించింది. అయితే సైనాతో పాటు ఈ అవార్డుకు మరో ఇద్దరు క్రీడాకారిణులు పోటీసడుతున్నారు. కరోలినా మారిన్ (స్పెయిన్), జావో యునెలి, బావో జిన్ (చైనా)లు కూడా ఈ అవార్డుకు పోటీపడుతున్నారు.

పురుషుల విభాగంలో చెన్ లాంగ్, జాంగ్ నాన్ (చైనా), లీ యాంగ్ డే, యూ ఇయోన్ సీయోంగ్ (కొరియా) అవార్డు రేసులో ఉన్నారు. ఎంపికైన వారి పేర్లను ఈనెల 7న దుబాయ్‌లో జరిగే వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ రిసెప్షన్, గాలా డిన్నర్‌లో ప్రకటిస్తారు. చెన్నై బాధితులకు రూ.2 లక్షల విరాళం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నై ప్రజలకు తన వంతు సహాయంగా 2 లక్షల రూపాయలను సైనా విరాళంగా ప్రకటించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BWF awards  "The best female athlete ' Award  Indian star Saina Nehwal  

Other Articles