shuttler srikanth enters indonesian masters semis

Indian shuttler srikanth enters indonesian masters semis

Indonesia Open tournament, India's number-one Kidambi Srikanth, badminton player Kidambi Srikanth, Semifinal

Shuttler Kidambi Srikanth remained the India's lone challenge at the $120,000 Indonesian Masters Grand Prix Gold as P.V. Sindhu lost her women's singles quarterfinal in straight games at the Gedung Graha Cakrawala

సెమీస్ లోకి దూసుకెళ్లిన కిదాంబి శ్రీకాంత్

Posted: 12/05/2015 05:27 PM IST
Indian shuttler srikanth enters indonesian masters semis

తనలోని లోపాన్ని తెలుసుకున్నాడు. దానిని అధిగమించాలని నిశ్చయించుకున్నాడు. ఇక వెనక్కు తిరగి చూడకుండా ముందుకు సాగిపోతున్నాడు. అతడే.. భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్. గత ఏడు నెలల్లో తాను పాల్గొన్న 15 టోర్నమెంట్‌లలో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన  శ్రీకాంత్...  ఎట్టకేలకు దానిని అధిగమించాడు. ఇండోనేసియా ఓపెన్ మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ ఆటగాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21-10, 21-5తో 15వ సీడ్ టెక్ జీ సూ (మలేసియా)పై అలవోకగా గెలిచాడు.

కేవలం 24 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్, ఇండోనేసియా రైజింగ్ స్టార్ జిన్‌టింగ్ ఆంథోనీతో శ్రీకాంత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 0-1తో వెనుకబడ్డాడు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 21-23, 13-21తో ప్రపంచ 67వ ర్యాంకర్ హీ బింగ్‌జియావో (చైనా) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో గేమ్ పాయింట్‌ను చేజార్చుకొని మూల్యం చెల్లించుకుంది. ఇక రెండో గేమ్‌లో సింధు కోలుకోలేకపోయింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles