jayaram guru- hulasi dutch open

P c thulasi ajay and gurusai advance in dutch open

Dutch Open Grand Prix, Topsportcentrum Almere,Jayaram, Gurusai dutt, Dutch Open badminton, shuttler Ajay Jayaram, R.M.V. Gurusaidutt, Korea Open,

Indian men's singles shuttlers Ajay Jayaram and R.M.V. Gurusaidutt won their respective first two matches to enter the third round of the $50,000 Dutch Open Grand Prix, being played at the Topsportcentrum Almere here.

డచ్ ఓపెన్ లో రాణిస్తున్న భారత షెట్లర్లు

Posted: 10/08/2015 08:54 PM IST
P c thulasi ajay and gurusai advance in dutch open

డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీలో భారత షట్లర్లు అజయ్ జయరామ్, గురుసాయిదత్ లు అద్భుతంగా దూసుకుపోతున్నారు. గత నెలలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన జయరామ్ కోరియా ఓపెన్ లో పురుషుల సింగిల్స్ లో ఫైనల్ వరకు దూసుకళ్లాడు. ఇప్పడు కూడా అదే తరహా ఆటను ప్రదర్శించి.. మున్ముందుకు దూసుకెళ్తున్నాడు. అజయ్ జయరామ్ కు తోడుగా గురుసాయిదత్ కూడా పురుషుల సింగిల్స్ లో బాగానే రాణిస్తున్నాడు. వీరిద్దరు డచ్ ఓపెన్ గ్రాండ్ ప్రిలో  ప్రీక్వార్టర్స్లో ప్రవేశించారు.

పురుషుల సింగిల్స్ మూడవ సీడ్ కు చెందిన అజయ్ జయరామ్ రెండో రౌండ్లో  21-14, 21-10 స్కోరుతో ఫాబియన్ రోత్ (జర్మనీ)పై విజయం సాధించాడు. అంతకుముందు స్థానిక ఆటగాడు మార్క్ కాల్జవ్ తో తలపడి 19-21, 21-17, 21-18 స్కోరుతో విజయాన్ని అందుకున్నాడు. తదుపరి ఫిన్నిష్ కాస్పర్ లెహికోనిన్ తో తలపడనున్నాడు. మరో మ్యాచ్లో గురుసాయి 21-14, 21-19తో చున్ వీ చెన్ (చైనీస్ తైపీ)ని 38 నిమిషాలలో ఓడించాడు. కామెన్ వెల్త్ గేమ్స్ క్యాంస పతకాన్ని సాధించిన గురుసాయిదత్ తదుపరి ఆటలో ఉక్రెయన్ కు చెందిన డ్రిమ్ ట్రో జావదస్కైతో తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్లో పీసీ తులసి 20-22, 21-15, 21-16తో మహులెట్టె (నెదర్లాండ్స్)పై గెలుపొందింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayaram  Gurusai dutt  Dutch Open badminton  

Other Articles