Indian archers to have Yoga sessions with Baba Ramdev for 2016 Rio Olympics

Baba ramdev to train indian archers for rio games

Indian Archery, Yoga, Baba Ramdev, 2016 Rio de Janeiro Olympics, Deepika Kumari, AAI, Vijay Kumar Malhotra, indian archery association, rio olympics, 2016 Rio de Janeiro Olympics,sports news

In a sport like archery where archers need better body positioning, enhance breathing techniques, and above all, an unflinching concentration, Yoga may come handy.

ఆర్చరీ క్రీడాకారులకు రాందేవ్ బాబా యోగా పాఠాలు..

Posted: 08/05/2015 06:37 PM IST
Baba ramdev to train indian archers for rio games

ఒలంపిక్స్ క్రీడలకు వెళ్లనున్న భారత క్రీడాకారులు పతకాలను సాధించేందుకు వీలుగా భారత క్రీడా మంత్రిత్వ శాఖ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. క్రీడాకారులు ఎలాంటి పరిస్థితులలో వారి ఏకాగ్రతను, అకుంటిత దీక్షను కొల్పోకుండా వారికి యోగా తరగతులు నిర్వహించాలని భావిస్తుంది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ తో భారత ఆర్చరీ క్రీడాకారులకు యోగా తరగతులు ఇప్పించాలని భావిస్తున్న అర్చరీ అసోసియేషన్ ఇందుకోసం రాందేవ్ ను కలసి యోగా తరగతులు నిర్వహించాలని అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా కోరారు.

2016లో రియో ఒలంపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని అర్చర్లు అన్ని విధాల సిద్దమయ్యేందుకు యోగా బాగా ఉపయోగపడుతుందన్న అలోచనతోనే ఈ నిర్ణక్ష్ం తీసుకున్నట్లు అర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా తెలిపారు. తీవ్రమైన పోటీల సమయంలో భారత అర్చర్లు మానసికంగా, బలంగా వుండాలంటే యోగా తప్పకుండా దోహదం చేస్తుందని, అందుకనే భారత అర్చర్లకు యోగా తరగతులను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీంతో వచ్చే సంవత్సరం జరిగే రియో ఒలింపిక్స్ లో అర్చర్లు పతాకాలు సాధించేందుకు ఇది బాగా సాయపడుతుందన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baba ramdev  vijay kumar malhotra  indian archery association  rio olympics  

Other Articles