Diego Maradona Denounced for Fraud by Ex-Wife Claudia Villafane | Robbery | Soccer Game

Diego maradona denounced for fraud by ex wife claudia villafane robber case

Diego Maradona, Diego Maradona news, Diego Maradona controversy, Diego Maradona money problems, Diego Maradona ex-wife claudia villafane, claudia villafane news, soccer game

Diego Maradona Denounced for Fraud by Ex-Wife Claudia Villafane : Claudia Villafane, the ex-wife of Argentinean soccer legend Diego Maradona, late Tuesday denounced him for fraud in an Argentinean court

మారడోనాపై కుండబద్దలు కొట్టిన మాజీ భార్య

Posted: 07/22/2015 12:58 PM IST
Diego maradona denounced for fraud by ex wife claudia villafane robber case

విశ్వవ్యాప్తంగా పేరుగాంచిన అర్జెంటీనా సాకర్ దిగ్గజం డియేగో మారడోనా వ్యక్తిగత జీవితంలో చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలపై తన ప్రియురాలితోపాటు మాజీ భార్యతో సైతం తీవ్ర స్థాయిలో విమర్శలనెదుర్కొంటున్నాడు. తన భర్త మారడోనా పెద్ద మోసగాడంటూ అతగాడి మాజీ భార్య క్లాడియా విల్లాఫాస్ పేర్కోవడం పెద్ద సంచలనంగా మారింది. ఇంతకీ ఈ మొత్తం వ్యవహారం ఏంటి..? అని ఆలోచిస్తున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే...

తన బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా 6 లక్షల మిలియన్ డాలర్లు మాయం అయ్యాయని మారడోనా ఇటీవలే కోర్టుకు ఎక్కారు. తన డబ్బు తనకు తిరిగి కావాలంటూ కోర్టుకు తెలిపాడు. అయితే.. తన డబ్బులు ఎవరు దొంగలించారో వారి పేర్లు బయటపెట్టాలనుకోవడం లేదని, తాను ఎవరిపైనా నిందలు వేయదలచుకోలేదని చెప్పాడు. ఈ దొంగతనం వ్యవహారంలోనే ఇతగాడి మాజీ భార్య తన కుమార్తె జియానియాతో కలిసి బుధవారం బ్యూనోస్ ఎయిర్స్ కోర్టులో హాజరైంది. ఈ సందర్భంగానే ఆమె తన భర్త పెద్ద మోసగాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అటు.. ఈమె తరఫు న్యాయవాది ఆమెను నిరపరాధి అని రుజువు చేస్తానని తెలిపాడు.

ఇదిలావుండగా.. తన బంగారు ఆభరణలు దోచుకెళ్లిందని మారడోనా గతంలో తన మాజీ ప్రేయసి ఒలివాపై కూడా ఆరోపణలు చేశాడు. ఆ సందర్భంలోనూ ఆ ప్రేయసి మాట్లాడుతూ.. తనను కావాలనే మారడోనా ఇరికించాడని వాపోయింది. ఎంతో పేరుప్రఖ్యాతలు గడించిన మారడోనా.. ఇలా వరుసగా వ్యక్తిగత వివాదాల్లో తెరమీదకు రావడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగిస్తోందని సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diego Maradona  Claudia Villafane  Soccer Game  

Other Articles