Surfer punches shark to survive nasty attack

Surfer punches shark to survive nasty attack

surfing, Mick Fanning, Jeffreys Bay, Julian Wilson

Knocked off his board by an attacking shark, three-time world champion Mick Fanning punched the creature before escaping unharmed during the televised finals of a world surfing competition in South Africa The Australian surfer was struck by the shark from behind and knocked into the water as he sat on his board waiting his turn during the JBay Open in Jeffrey's Bay in the Eastern Cape Province.

షార్క్ నోటి నుండి తప్పించుకున్న సర్ఫర్

Posted: 07/20/2015 07:12 PM IST
Surfer punches shark to survive nasty attack

ఓవైపు అలలతో ఎగిసిపడుతున్న సముద్రం. మరోవైపు సముద్రపు అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు. ఇలా జె బె ఓపెన్‌ సముద్రం జనసందోహంతో కనిపించింది. అదీ గాకుండా అక్కడ సర్ఫింగ్‌ పోటీలు కూడా జరుగుతున్నాయి. దీంతో బీచ్‌ దగ్గర సందడి నెలకొంది. ఆస్ట్రేలియాకు చెందిన మిక్‌ ఫాన్నింగ్‌ సముద్రంలో సర్ఫింగ్‌ చేస్తుండగా హఠాత్తుగా ఓ షార్క్‌ వచ్చి దాడి చేసింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ షార్క్‌ మిక్‌ ఫాన్నింగ్‌‌ కాలుని కరచుకొని సముద్రపు అడుక్కి తీసుకెళ్లింది. నీటిలో గిలగిల కొట్టుకుంటున్న మిక్‌ ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పీడు బోట్ల సాయంతో షార్క్‌ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఎలాగోలా ఆ షార్క్‌ నుంచి తప్పించుకున్న మిక్‌‌ ని వెంటనే బోటులో ఎక్కించుకొని ఒడ్డుకు తీసుకువచ్చారు.

స్వల్పగాయాలతో మిక్‌ బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మూడు సార్లు ప్రపంచ సర్ఫింగ్‌ పోటీల్లో విజేతగా నిలిచిన మిక్‌ ఫాన్నింగ్‌ ఈ హఠాత్‌ పరిణామానికి కాస్త భయపడినా ఆ తర్వాత కోలుకున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే షార్క్ నోటికి అందినా కూడా ప్రాణాలతో బతికి బయటపడ్డ మిక్ ఫాన్నింగ్ ఎంతో అదృష్టవంతుడు. అయితే షార్క్ నోటి నుండి ఎంతో చాకచక్యంగా మిక్ తప్పించుకున్నారని, అలాగే సెక్యూరిటీ సిబ్బంది కూడా వేగంగా స్పందించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని అక్కడి వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయినా అదృష్టవంతుల్ని షార్క్ మాత్రం ఏమీ చెయ్యలేదు అని అందరూ అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : surfing  Mick Fanning  Jeffreys Bay  Julian Wilson  

Other Articles