Jwala fires upon badminton selection committee

Gutta jwala, Gutta jwala fires again, jwala fires selection committee, jwala fires on badminton selections, Gutta Jwala not into team, Gutta Jwala not into telangana team, gutta jwala, telangana, badminton, gopi chand academy, telangana badminton selection committee,

Badminton player Gutta Jwala fired at badminton selection committee for not selecting her to Telangana team.

జట్టులో నాకు స్థానం ఎందుకు కల్పించలేదు..

Posted: 01/22/2015 05:32 PM IST
Jwala fires upon badminton selection committee

జాతీయ క్రీడలకు ఎంపిక చేసిన తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టులో తనకు చోటు కల్పించకపోవడంపై డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను కాదని ఒక పశ్చిమ బెంగాల్ క్రీడాకారిణిని ఎంపిక చేశారని ఆమె ట్విట్టర్ ద్వారా విమర్శించింది. ‘తెలంగాణ జట్టులో బెంగాలీ ప్లేయర్‌కు స్థానం దక్కడంపై అమె విస్మయం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌కు చెందిన తనను ఎందుకు జట్టులోనికి తీసుకోలేదని ఆమె ప్రశ్నించింది. తనను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు ఏంటో తనకు తెలియదని, కానీ ఈ చర్య తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పింది.

తెలంగాణ బ్యాడ్మింటన్ లో తరుణ్, సిక్కిరెడ్డిలకు కూడా చోటు దక్కలేదంటే.. జట్టు తరపున అసలు ఎవరు ఆడుతున్నారో అర్థం కావడం లేదని తెలిపింది. ఎవరూ దీనిని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీసింది. ఒక బెంగాల్ అమ్మాయి తెలంగాణకు ఆడుతుండగా? తామంతా బతికే ఉన్నాం కదా’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే రాష్ట్ర జట్టును అసలు ఇప్పటి వరకు ప్రకటించనే లేదని తెలంగాణ సంఘం కార్యదర్శి పుల్లెల గోపీచంద్ స్పష్టం చేశారు. మరో వైపు కేరళ జాతీయ క్రీడలకు తెలంగాణ రాష్ట్రం ఆటగాళ్లు 8 క్రీడాంశాల్లో, ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు 11 క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించడం దాదాపు ఖరారైంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gutta jwala  telangana  badminton  gopi chand  

Other Articles