Telangana badminton team won bal badminton champion title on andhra pradesh team

telangana badminton team, andhra pradesh badminton team, bal badminton championship, telangana won bal badminton championship, ap state minister uma maheshwara rao, uma maheshwara rao news, telangana ministers

telangana badminton team won bal badminton champion title on andhra pradesh team : finally telangana badminton men team has won bal badminton champion title on andhra pradesh team in vijayawada.

సొంతగడ్డపై ఆంధ్రాను ఓడించిన తెలంగాణ..

Posted: 01/12/2015 01:11 PM IST
Telangana badminton team won bal badminton champion title on andhra pradesh team

రాజకీయ వ్యవహారాలను కాస్త పక్కనపెడితే.. క్రీడారంగంలో తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టు తమ అద్భుత ప్రదర్శనతో ఆంధ్రాను సునాయాసంగా ఓడించి, టైటిల్’ను సొంతం చేసుకుంది. చివరివరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్’లో చివరికి తెలంగాణ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకున్నారు. విజయవాడలో జరిగిన జాతీయ సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్’షిప్ పురుషుల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ తెలంగాణ టైటిల్ నిలబెట్టుకుంది.

మొదటినుంచి హోరాహీరోగా సాగిన ఈ మ్యాచ్’లో ఫస్ట్ రౌండ్’లో ఆంధ్రా ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనను ప్రదర్శించి 29-25 పాయింట్లతో గెలవగలిగారు. అయితే రెండో రౌండ్’లో మాత్రం పేలవ పెర్ ఫార్మాన్స్’తో 20-29 స్కోరుతో ఓడిపోయారు. ఇక మూడో రౌండ్ వచ్చేసరికి మరీ దారుణమైన ప్రదర్శనతో చతికిలపడిపోయారు. ఆంధ్రా కేవలం 6 పాయింట్ల స్కోరునే నమోదు చేయగా.. తెలంగాణ జట్టు 29 పాయింట్లు చేసి మూడోరౌండుతోబాటు టైటిల్’నే సాధించుకోగలిగింది.

అంటే.. ఫైనల్లో తెలంగాణ జట్టు 25-29, 29-20, 29-6 స్కోరుతో ఆంధ్రాజట్టుపై నెగ్గింది. విజేతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్రోఫీలు, అభినందనలు తెలియజేశారు. మరోవైపు తమ జట్టు విజయం సాధించడంతో తెలంగాణ మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో గెలుపోటములు సర్వసాధారణమేనని.. అనవసరంగా దీనిపై ఎటువంటి రాద్ధాంతం చేయకుండా వుండాలంటూ సూచనలు ఇచ్చినట్లు సమాచారం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana badminton team  bal badminton championship  telugu sports news  

Other Articles