Pv sindhu hopes 2016 olympic chance macau open grand prix gold pullela gopichand press meet

pv sindhu, pv sindhu latest news, pv sindhu press meet, pv sindhu interview, pv sindhu macau open, pv sindhu gopichand, pv sindhu hot photos, pullela gopichand press meet, pullela gopichand interview

pv sindhu hopes 2016 olympic chance macau open grand prix gold pullela gopichand press meet

ఆకాశమే హద్దుగా ప్రయత్నిస్తానంటున్న సింధు

Posted: 12/03/2014 12:12 PM IST
Pv sindhu hopes 2016 olympic chance macau open grand prix gold pullela gopichand press meet

ఇటీవలే మకావు గ్రాండ్ ప్రి గోల్డ్ గెలిచిన భారత బ్యాడ్మింటన్ పివి సింధు.. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే లక్ష్యంతో వచ్చే ఏడాది మరింత కష్టపడతానని అంటోంది. ఏవిధంగా అయితే తాను మకావు టైటిల్ సాధించిందో.. అదేవిధంగా వచ్చేఏడాది తన దూకుడును కొనసాగిస్తానని చెప్పింది. మకావు ఓపెన్ గెలిచిన తర్వాత తన స్వస్థలానికి చేరుకున్న సింధు.. మంగళవారం గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడింది. ఆ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

‘‘మకావు ఓపెన్ గ్రాండ్ ప్రిలో విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. నాకు సాధ్యమైనంతవరకు ఈ ఏడాది బాగానే ఆడాను. ఇక వచ్చే ఏడాది కూడా ఇంకా మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాను. అలాగే 2015 ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ సంవత్సరం. కాబట్టి ఆ లక్ష్యంతో సన్నద్ధమవుతున్నా’’ అని చెప్పింది. ప్రస్తుతం చైనాతో పాటు జపాన్, కొరియా క్రీడాకారిణుల నుంచి కూడా గట్టి పోటీ ఉంటోందన్న సింధు, భవిష్యత్తులో సాధ్యమైనంత తొందరగా సూపర్ సిరీస్ టైటిల్ గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేసింది.

ఇక ఈ సందర్భంగా మాట్లాడిన భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లల గోపీచంద్ ఆటగాళ్లకు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల భారత ఆటగాళ్లు మంచి విజయాలు సాధించినా ఉదాసీనత పనికి రాదని అన్నారు. మనతో పాటు ఇతర దేశాల యువ ఆటగాళ్లు విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని, ఈ స్థితిలో విశ్రాంతి తీసుకుంటే పరాజయాలు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. భారత గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి ప్రతిభను ప్రదర్శించాలని ఆయన అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pv sindhu  pullela gopichand  2016 olympic games  macau open grand prix  telugu news  

Other Articles