India hockey team won the match against pakistan with high score sultan johor cup under 21

india hockey team, pakistan hockey team, india hockey team under 21, sultan johor cup, sultan johor cup under 21, india vs pakistan hockey games, india vs pakistan, india hockey sports persons, pakistan hockey sports persons, india vs pakistan under 21 match

india hockey team won the match against pakistan with high score sultan johor cup under 21

పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన టీమిండియా హాకీ జట్టు!

Posted: 10/16/2014 01:49 PM IST
India hockey team won the match against pakistan with high score sultan johor cup under 21

ఏ విభాగంలోనైనా సరే.. భారత్ - పాకిస్తాన్ ల మధ్య జరిగే పోరాటం ఎంతో ప్రత్యేకంగా వుండిపోతుంది. ముఖ్యంగా క్రీడారంగంలో అయితే ఈ రెండు దేశాల మధ్య జరిగే పోటీ ఎంతో ఉత్కంఠభరితంగా వుండిపోతుంది. అందులో క్రికెట్ గురంచి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక హాకీ విషయానికి వస్తే.. ఆ రంగంలోనూ భారత్, పాకిస్తాన్ పై జూలు విదిల్చింది. ప్రత్యర్థి జట్టుకు ఒక్క అవకాశం ఇవ్వకుండా ఆటగాళ్లకు పట్టపగలే చుక్కలు చూపించేశారు. ఒకవైపు భారత్ వరుసగా గోల్స్ వేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంటే... మరోవైపు పాక్ ఆటగాళ్లను బంతికోసం పరుగులు వేయించింది.

ఇటీవల ఆసియా క్రీడల్లో జరిగిన హాకీ ఫైనల్లో ఇండియా, పాకిస్తాన్ ను మట్టికరిపించిన విషయం తెలిసిందే! ఇప్పుడు మరోసారి వారినే ఆదర్శంగా తీసుకున్న జూనియర్లు కూడా పాక్ పై చెలరేగిపోయారు. సుల్తాన్ జొహర్ కప్ అండర్-21 టోర్నమెంట్ లో భాగంగా బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ 6-0 స్కోరుతో పాకిస్తాన్ ను చిత్తుచేసేసింది. మ్యాచ్ ప్రారంభదశలో ఇద్దరూ జట్టు హోరాహోరీగా తలపడినా.. కొద్దిసేపటి తరువాత టీమిండియా ఆధిపత్యాన్ని చేజిక్కించుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఇరుజట్లలో ఆటగాళ్లు కొత్తవాళ్లయినప్పటికీ... ఇండియా క్రీడాకారులు మాత్రం అధ్భుతమైన ప్రతిభతో తమ సత్తా చాటుకున్నారు.

మొదట్లో ఇరుజట్టు హోరాహోరీగా తలపడిన నేపథ్యంలో ఏ జట్టు గోల్ సాధించలేకపోయింది కానీ.. ఆట 22వ నిముషంలో లభించిన పెనాల్టీ కార్నర్ ను ఇమ్రాన్ ఖాన్ గోల్ గా మలిచి, భారత్ కు బోణీ చేయించాడు. దాంతో ఇండియా జట్టు ఆధిపత్యాన్ని సాధించింది. అలాగే 34వ నిముషంలో పర్వీందర్ సింగ్ తన నైపుణ్యంతో భారత్ ఖాతాలో రెండో గోల్ ను చేర్చాడు. 49 నిముషంలో అర్మాన్ ఖురేషీ, 53వ నిముషంలో హర్మాన్ ప్రీత్ సింగ్, 67వ నిముషంలో వరుణ్ కుమార్, ఇక చివర్లో అర్మాన్ ఆటగాళ్లందరూ వరుసగా గోల్స్ సాధించి, ఇండియాకు భారీ విజయాన్ని అందించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles