Spain offer to 5 8 million bonous to players

Spain offer to 5.8 million to players, Brazil, Cameroon, Germany, Mexico, Moldova, Adoum Garoua, Joseph Owona, Laurence Fotso, Philemon Yang, Volker Finke, Enrique Iglesias, celebrities, spain champion,

FECAFOOT and will receive 5.8 million CFA francs more than the 50 million CFA francs originally offered to each player for their participation in the tournament.

స్పెయిన్ కి 133 కోట్ల ఆఫర్

Posted: 06/09/2014 12:36 PM IST
Spain offer to 5 8 million bonous to players

ఫిఫా వరల్డ్ కప్ మహా సంగ్రామానికి మరో మూడు రోజుల్లో తెర లేవబోతుంది. యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఈ టోర్నీ కోసం ఎదురు చూస్తుంది. మొత్తంగా ఇప్పుడు సాకర్ ఫీవర్ పట్టుకున్న నేపథ్యంలో 2010 ప్రపంచ కప్ విజేత అయిన స్పెయిన్ జట్టు మరోసారి కప్ గెలిస్తే ఆ దేశ ఫుట్ బాల్ సమాఖ్య ఆ జట్టు సభ్యులకు 133 కోట్ల రూపాయల బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. ప్రపంచంలో ఏ ఫుట్ బాల్ జట్టు ప్రకటించినంతగా ఇంత మొత్తాన్ని బోసన్ గా ఇవ్వజూపడం పై స్పెయిన్ ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నా ఫుట్ బాల్ సమాఖ్య ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో ప్రపంచకప్ గెలిచినందుకు దక్కే ప్రైజ్ మనీ కాకుండా, స్పెయిన్ ఫుట్ బాల్ సమాఖ్య ఒక్కో ఆటగాడికి రూ. 4.8 కోట్ల చొప్పున 23 మంది ఆటగాళ్లకు ఇచ్చింది. ఈసారి దాన్ని 5.8 కోట్లకు పెంచింది. అంటే అందరి సభ్యులకు కలిసి 133 కోట్లకు పైగా చెల్లించాడనికి సిద్ద పడ్డారన్న మాట. మరి స్పెయిన్ ఆటగాళ్లు తన శక్తి మేరకు రాణించి ఈ 133 కోట్లు కొట్టేస్తారో లేదో చూడాలి.

ఈయన స్పెయిన్ పూనమ్ పాండే...

భారత్ లో క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిస్తే బట్టలిప్పేస్తానని చెప్పిన పూనమ్ పాండే కప్ గెలిచిన తరువాత ఆ పని మాత్రం చేయలేదు. కానీ స్పానిష్ సింగర్, ప్రముఖ నటుడు ఎన్రిక్ ఇగ్లేసియస్ మాత్రం అన్న మాటను నిలబెట్టుకుంటున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ మరోసారి విజేతగా నిలిస్తే లండన్ ట్రాఫాల్గర్ స్క్వేర్‌లోని సింహంపై అందరి ముందు నగ్నంగా కూర్చుంటానని ఓ టీవీ షోలో చెప్పాడు. అయితే ఇగ్లేసియస్ గత ప్రపంచకప్‌కు ముందు స్పెయిన్ చాంపియన్‌గా నిలిస్తే నగ్నంగా వాటర్ స్కీయింగ్ చేస్తానన్నాడు. ఆ ప్రపంచకప్‌లో స్పెయిన్ విజేతగా నిలవడంతో తన మాటను నిలుపుకున్నాడు. ఈ విషయంలో ఇగ్లేసియస్ తను ఇచ్చిన మాటను నిలుపుకున్నప్పటికీ కొందరు మోడల్స్‌కు మాత్రం అలాంటి అవకాశం రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles