Fifa under pressure to rerun world cup 2022 vote after bribery claims

World Cup 2022 vote after bribery claims, Fifa to rerun the bidding, World Cup 2022, Qatar 2022 World Cup, Qatar World Cup corruption.

Fifa under pressure to rerun World Cup 2022 vote after bribery claims

కప్ కోసం పోటీ పడి భారీగా లంచాలు!

Posted: 06/03/2014 10:37 AM IST
Fifa under pressure to rerun world cup 2022 vote after bribery claims

అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘ ఫిఫా’ ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు అందించి మరీ హక్కుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ గతంలో పలువురిపై ఆరోపణలు వచ్చాయి. ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించేందుకు భారీగా నిధులు అవసరమైనా, అందుకు రెట్టింపు ఆదాయం లభిస్తుంది. అంతేగాక, ఈ ఈవెంట్‌ను నిర్వహించడం ‘స్టేటస్ సింబల్’గా మారింది. అందుకే, వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చే అవకాశం కోసం ప్రపంచ దేశాలు పోటీపడతాయి.

అయితే, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో అవి మరుగున పడ్డాయి. తాజాగా కతార్ షేక్, ఆసియా ఫుట్‌బాల్ కానెఫడరేషన్ మాజీ చీఫ్ మహమ్మద్ బిన్ హమ్మమ్ ఇదే విధంగా ఫిఫా అధికారులకు లంచాలిచ్చినట్టు బ్రిటిష్ పత్రిక ‘ది సండే టైమ్స్’ ఆధారాలతో సహా బయటపెట్టడం సంచలనం సృష్టిస్తున్నది.

2022లో వరల్డ్ కప్‌ను నిర్వహించే అవకాశం కోసం కతార్ పోటీపడుతుండగా, తమకు అనుకూలంగా మద్దతు కూడగట్టుకోవడానికి హమ్మమ్ డబ్బును వెదజల్లినట్టు ‘ది సండే టైమ్స్’ స్పష్టం చేసింది. ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్‌కు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని కూడగట్టుకునే ప్రయత్నంలో విఫలమైన హమ్మమ్ 2012లో ఆసియా ఫుట్‌బాల్ కానెఫడరేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు.

అంతేగాక, ఫిఫాలో తనకు ఉన్న సభ్యత్వాన్ని కూడా వదులుకున్నాడు. అనంతరం సమావేశమైన ఫిఫా ఎథిక్స్ కమిటీ అతనిపై జీవితకాల సస్పెన్షన్‌ను విధించింది. ఆఫ్రికాకు చెందిన 30 ఫుట్‌బాల్ సంఘాల అధ్యక్షులు నిర్వహించే ఖాతాలకు సుమారు 2,00,000 డాలర్లు అతను మరలించాడని, కతార్‌కు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించాడని అతనిపై అభియోగాలు ఉన్నాయి.

Fifa-world-cup-2022

ఇలావుంటే, తాజాగా బ్రిటిష్ పత్రిక వెల్లడించిన సమాచారం మేరకు ఫిఫా మాజీ ఉపాధ్యక్షుడు జాక్ వార్నర్ ఖాతాలో అతను 16 లక్షల డాలర్లు జమ చేశాడు. ఇందులో సుమారు 4.5 లక్షల రూపాయలను ఓటింగ్‌కు ముందు ఆ ఖాతాలో వేశాడు.

2010లో సమావేశమై 2018 వరల్డ్ కప్‌ను రష్యాలో, 2022 వరల్డ్ కప్‌ను కతార్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న 22 మంది ఫిఫా సభ్యుల్లో వార్నర్ ఒకడు. మరుసటి సంవత్సరమే అవినీతి ఆరోపణలపై వార్నర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 

కతార్ షేక్ డబ్బుతోనే వరల్డ్ కప్ నిర్వహణ హక్కులను సంపాదించాడన్నది ‘ది సండే టైమ్స్’ ఆరోపణ. తన అభియోగాలను రుజువు చేసేందుకు సేకరించిన సమాచారాన్ని బహిర్గతం చేయడం ఫిఫాను ఇరుకున పడేసింది. కతార్ వరల్డ్ కప్ హక్కులను కొనసాగించాలా లేక రద్దు చేయాలన్న అన్నది ఫిఫా ముందున్న ప్రధాన అంశం. ఏ చర్య తీసుకున్నా సమస్య పరిష్కారం కాకపోతే మరింత ముదిరే ప్రమాదం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles