Brazil president dilma rousseff condemns football racism

Dilma Rousseff, Brazil president, Brazil president Dilma Rousseff, Brazilian players, football racism, condemns football,

Brazil president Dilma Rousseff condemns football racism

మా పై జాతి వివక్ష ఎందుకు?

Posted: 03/12/2014 12:25 PM IST
Brazil president dilma rousseff condemns football racism

బ్రెజిలియన్‌ క్రీడాకారులతో పాటు.. అధికారుల విషయంలో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగడంతో, ఫుట్‌బాల్‌లో జాతి వివక్షను చూపడం పట్ల బ్రెజిల్‌ అధ్యక్షుడు డిల్మా రౌసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్‌లో పోస్‌‌ట చేశారు. 

ఆయనకు బ్రెజిల్‌ మాజీ మిడ్‌ ఫీల్డర్‌ అరౌకా కూడా మద్దతుపలికాడు. అరౌకా మార్చి 6వ తేదీన సావో పౌలో స్టేట్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలలో ఆడుతుండగా ఓ అభిమాని అతడిని జాతిపేరుతో దూషించాడు. ఆఫ్రికా ఖండం వెలుపల అత్యంత ఎక్కు వగా నల్లజాతి జనాభా ఉన్న బ్రెజిల్‌ లాంటి దేశం లో ఇలా జాతివివక్ష ఉండటం ఏమాత్రం సరికాదని, దీన్ని అంగీకరించలేమని రౌసెఫ్‌ చెప్పారు. 

ఈ సంవత్పరం ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ పోటీలు జరుగుతున్నప్పుడు జాతివివక్ష వ్యతిరేక సందేశాన్ని థీమ్‌గా తీసుకోవాలని కూడా ఆయన కోరారు. ఈ విషయమై ఇప్పటికే తాము ఐక్యరాజ్య సమితితోను, ఫిఫాతోను కూడా మాట్లాడినట్లు చెప్పారు.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles