న్యూజిలాండ్ లో టీమ్ ఇండియా ప్రదర్శ ఎలా ఉంది? అని భారత క్రికెట్ అభిమానుల్లో ఎవరిని అడిగినా.. వన్డెల్లో నెంబర్ వన్ గా వెళ్లిన జట్టు ఇలాగా ఆడేది.. అసలు ఈ జట్టు టెస్టుల్లో రెండో స్థానానికి తగిన జట్టు కాదని అందరు అంటున్నారు. కొన్నేళ్లుగా విదేశాల్లో ఒక టెస్టైనా గెలవని జట్టుకు విదేశీ పర్యటనలెందుకు? ఇలా చాలా మంది క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కానీ టీమిండియా కెప్టెన్ ధోనిని మాత్రం మరోల చెబుతున్నాడు. టిమిండియా జట్టు చాలా కష్టపడిందని, మాది నైపుణ్యమున్న జట్టని నిరూపించామని ధోని అంటున్నారు. దక్షిణాప్రికా పర్యటన నుంచి మెరగవుతున్నాం. కివీస్ తో సిరీస్ లో , చివరి టెస్టు లో బాగా పోరాడాం.
మా బౌలర్లు సరైన ప్రాంతాల్లోనే బంతులు వేశారు. మేక్ కిలమ్ , వాట్లింగ్ కివీస్ పై ఒత్తిడిని దూరం చేశారు అని అతడు బౌలర్లను వెనకేసుకొచ్చాడు. రెండో టెస్టులో మేం రెండున్న రోజులు ఫీల్డింగ్ చేయాల్సివచ్చింది. అయినా బౌలర్లు సవాల్ ను స్వీకరించి వికెట్లు తీసెందుకు చెమటోడ్చారు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్ ల నుంచి పాఠాలు నేర్చుకున్నాం అని కెప్టెన్ ధోని అన్నారు.
‘‘ విదేశాల్లో మ్యాచ్ లు గెలవాలంటే ధోని సాహసాలకు సిద్దపడాలి. కొన్ని మ్యాచ్ లు కోల్పోవాల్సి వస్తుందని తెలిసినా ప్రయోగాలు చేయకతప్పదు. ముందు అతడు బౌలర్లపై నమ్మకముంచాలి. కెప్టెన్ గా ఎన్నో ఘనతలు సాధించిన ధోని.. విదేశాల్లో కెప్టెన్ గా విఫలమయ్యాడు. అయితే అతడికి నిరూపించుకునేందుకు అవకాశమివ్వాలి. ఈ ఏడాదంతా అతడిని కొనసాగించాలి రాహుల్ ద్రవిడ్ అన్నారు. ’’
భారత్ వచ్చే ప్రపంచకప్ ను గెలుచుచుకోవాలనుకుంటే.. ధోనీ ఏదో ఒక దశలో , ఎక్కడో ఓ చోట విశ్రాంతి తీసుకోవటం అవసరం. ప్రపంచకప్ నేపథ్యంలో టెస్టు కెప్టెన్సీ నుంచి అతడు తప్పుకుంటే బాగుంటుందనిపిస్తోంది. అప్పుడతడు నూతనోత్తేజం పొందుతాడు. అతడు అధ్బతమైన క్రికెటర్. కానీ ఇప్పటి నుంచి అతడు ప్రతి ఫార్మాట్లోనూ కెప్టెన్సీ చేయలేడు. టెస్టు నాయకత్వాన్ని కోహ్లికి ఇవ్వొచ్చు అని మార్టిన్ క్రో అన్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more