Serena sails to semis beats navarro in 52 minutes

Serena sails to semis, US Open 2013 ,

Serena Williams leaves Carla Suarez Navarro by the wayside with a devastating performance. That wasn’t a sporting competition at Arthur Ashe Stadium Tuesday night.

యూఎస్ ఓపెన్ సెమీస్ లో సెరెనా

Posted: 10/17/2013 07:11 PM IST
Serena sails to semis beats navarro in 52 minutes

పట్టుదల ఉంటే వయస్సు అడ్డంకి కాదు అని నిరూపిస్తుంది అమెరికా నల్లుకలువ భామ సెరెనా విలియమ్స్. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ ఓపెన్ లో మూడు పదుల వయస్సు దాటినా నాలో ఏ మాత్రం సత్తువ తగ్గలేదు అని నిరూపిస్తుంది. ఈ యూఎస్ ఓపెన్ లో ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడుతూ టైటిల్ కి రెండు అడుగుల దూరంలో నిలిచిన ఈ భామ నిన్న క్వార్టర్ ఫైనల్లో కార్లా నవారోతో జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపాన్ని చూపించి సెమీస్ కి దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ సెరెనా 6-0, 6-0తో 18వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)ను చిత్తు చేసింది. కేవలం 52 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా తన ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. పదునైన సర్వీస్‌లకుతోడు శక్తివంతమైన గ్రౌండ్ స్ట్రోక్స్‌తో చెలరేగిపోయిన సెరెనాకు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. నాలుగు ఏస్‌లు సంధించిన ఈ టాప్ సీడ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. కేవలం తొమ్మిది అనవసర తప్పిదాలు చేసిన ఈ డిఫెండింగ్ చాంపియన్ 20 విన్నర్ షాట్స్‌ను నమోదు చేసింది. గత కొన్ని రోజులుగా సంచలనాలు నమోదు చేయని సెరెనా ఈ యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి చరిత్ర స్రుష్టిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles