నర్సింగ్ యాదవ్ రియో ఒలంపిక్స్ కు లైన్ క్లియర్ | Narsingh Yadav gets clean chit from NADA

Narsingh yadav gets clean chit from nada

Narsingh Yadav clean chit, NADA Narsingh Yadav, Narsingh Yadav Rio olympics, Narsingh Yadav susheel kumar, Narsingh Yadav convict, relief to Narsingh Yadav

Narsingh Yadav gets clean chit from NADA, allowed to participate in Rio 2016 Olympics.

బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద లైన్ క్లియర్

Posted: 08/02/2016 07:32 AM IST
Narsingh yadav gets clean chit from nada

డోపింగ్ ఆరోపణలతో ఒలంపిక్స్ కు దూరం అవుతానని బయపడుతున్న నర్సింగ్ యాదవ్ కు ఊరట లభించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అతనిికి ఒలంపిక్స్ లో పాల్గొనే అవకాశం కల్పించింది.   అండగా భారత రెజ్లింగ్ సమాఖ్య నిలవడంతో అతనికి అడ్డంకులు తొలగిపోయాయి.

డోపింగ్ కు పాల్పడ్డాడంటూ 'నాడా' రిపోర్టులు నిర్ధారించడంతో నర్సింగ్ యాదవ్ ఒలింపిక్ కలలు కల్లలయ్యాయి. అసలు రియో ఒలింపిక్స్ లో పాల్గొననున్న రెజ్లర్ల జాబితా విడుదలైన నాటి నుంచి నర్సింగ్ యాదవ్ ను అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒక దశలో పేరు ప్రఖ్యాతులున్న ఆటగాళ్లంతా నర్సింగ్ యాదవ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారంటే ఆశ్చర్యం కలగకమానదు. న్యాయస్థానాల్లో కూడా అతని ప్రాతినిధ్యంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

మరోపక్క, నర్సింగ్ యాదవ్ ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకిస్తున్న శిబిరంలో ఆనందం తాండవించింది. 'నాడా' ఫలితాలు రాగానే ప్రత్యర్థులు చేసిన ట్వీట్ తో తీగ కదిలింది. దీంతో నర్సింగ్ యాదవ్ వివరణ, అనుమానాలు విన్న రెజ్లింగ్ సమాఖ్య...అతనికి అండగా నిలిచింది. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన రెజ్లింగ్ సమాఖ్య దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలతో రియోకు నర్సింగ్ యాదవ్ నే పంపాలని నిర్ణయించింది.

ఈ మేరకు దర్యాప్తు వివరాలతో కూడిన నివేదికను ఒలింపిక్ సంఘానికి తెలపడం ద్వారా నర్సింగ్ యాదవ్ కు 'బెనిఫిట్ ఆఫ్ డౌట్' కింద ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం కల్పించారు. దీంతో రియో ఒలింపిక్స్ లో నర్సింగ్ యాదవ్ పాల్గొనడంపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఇంత వివాదం మధ్య నర్సింగ్ యాదవ్ ఒలింపిక్ పతకం తేగలిగితే... అతని పేరు భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narsingh Yadav  Rio Olympics  Drugs  NADA  clean chit  

Other Articles