Suryakumar Yadav breaks Yuvrajs record గణంకాల మేరకు సూర్యనే టీ20ల్లో నెంబర్ వన్.!

Suryakumar yadav sets benchmark in build up to t20 world cup

Suryakumar Yadav, Shreyas Iyer, Hooda, Rohit Sharma, Virat Kohli, Rahul Dravid, Head Coach, t20 world cup, t20 asia cup, suryakumar yadav t20 world cup record, suryakumar yadav Yuvraj singh, india vs hong kong, dubai, asia cup 2022, Cricket news, sports news, cricket, Sports

Suryakumar Yadav was still spreading the joy as he walked in for the press conference after his spectacular 26-ball 68 against Hong Kong. India’s T20 stalwart looks like he is having a ball when he is out in the middle these days, and even during the 11-minute interaction, he wore a charming smile right through.

టీమిండియా గణంకాలు: టీ20ల్లో సూర్యకుమార్ నెంబర్ వన్.!

Posted: 09/03/2022 06:51 PM IST
Suryakumar yadav sets benchmark in build up to t20 world cup

ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్‌తో ముగిసిన మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ లో తనదైన శైలిలో విరుచుకుపడిన సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ బ్యాటింగ్‌కు రాకముందు.. వచ్చిన తర్వాత అన్నట్టుగా సాగింది. టీ20లలో చెలరేగి ఆడుతున్న ఈ నయా మిస్టర్ 360.. జులైలో ఇంగ్లండ్, ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనల్లోనూ ఇదే దూకుడును కొనసాగించాడు. దీంతో టీమిండియా అభిమానులంతా అతడిని టీ20లలో భారత జట్టు నెంబర్ వన్ ఆటగాడిగా కీర్తిస్తున్నారు. మరి ఇందులో వాస్తవమెంత..? గణాంకాలు ఏం చెబుతున్నాయి..?

ఐపీఎల్ మెరుపులతో సూర్యకుమార్ యాదవ్ 2021లో భారత టీ20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడి అరంగేట్రం నుంచి చూసుకుంటే టీమిండియాలో అత్యధిక పరుగులతో పాటు సగటు, స్ట్రైక్ రేట్ లోనూ సూర్యనే మిగిలిన అగ్రశ్రేణి బ్యాటర్లకంటే ముందున్నాడు. 2021 నుంచి ఇప్పటివరకు సూర్య మొత్తంగా 25 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 23 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 758 పరుగులు చేశాడు. సగటు 39.89గా ఉంది. ఇందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలున్నాయి. ఈ జాబితాలో రోహిత్ శర్మ.. 26 ఇన్నింగ్స్ (సూర్య ఎంట్రీ నుంచి మాత్రమే)లలో 747 పరుగులు చేశాడు.

రోహిత్ కూడా 6 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (19 ఇన్నింగ్స్ లలో 543 పరుగులు, 4 హాఫ్ సెంచరీలు), శ్రేయాస్ అయ్యర్ (19 ఇన్నింగ్స్ లలో 533) ఉన్నారు. విరాట్ కోహ్లీ 13 ఇన్నింగ్స్‌లలో 474 రన్స్ చేశాడు. ఈ అందరిలో ఒక్క విరాట్ కోహ్లీ సగటు (59.25) మాత్రమే సూర్య కంటే ఎక్కువగా ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు టీ20లలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్ల జాబితా చూస్తే అందులోనూ సూర్యనే ముందున్నాడు. ఈ ఏడాది 14 ఇన్నింగ్స్ లో సూర్య.. 514 పరుగులు చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ (14 ఇన్నింగ్స్, 449 పరుగులు), రోహిత్ శర్మ (15 ఇన్నింగ్స్, 323) ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles