Kevin O'Brien bows out from international cricket అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఐర్లాండ్ క్రికెటర్

Ireland all rounder kevin o brien retires from international cricket aged 38

Kevin O'Brien retires from International cricket, Kevin O'Brien retirement, Kevin O'Brien Twitter announcement, Kevin O'Brien records, Kevin O'Brien century, Kevin O'Brien retires, Ireland, Ireland cricket team, Kevin O'Brien Ireland, Cricket, sports

Ireland all-rounder Kevin O’Brien announced his retirement from all formats of cricket on Tuesday. O'Brien penned down a long note to bid adieu to the game and shared it on his Twitter handle with a caption that reads, “Thanks.” In the statement, he has thanked each and every individual who had been a constant support during his playing days.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఐర్లాండ్ క్రికెటర్

Posted: 08/16/2022 07:43 PM IST
Ireland all rounder kevin o brien retires from international cricket aged 38

ఐర్లాండ్ క్రికెట్ గురించి ప్రస్తావించగానే గుర్తొచ్చే పేరు కెవిన్ ఒబ్రెయిన్. 16 ఏళ్ల పాటు ఐర్లాండ్ జట్టులో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్న కెవిన్.. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌‌కు వీడ్కోలు చెప్పాడు. ఇవాళ (ఆగస్టు 16) ట్విటర్ వేదికగా అతడు ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా అతడు ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన కోచ్‌లు, కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. 2006 నుంచి ఐర్లాండ్ తరఫున ఆడుతున్న ఒబ్రెయిన్.. ఆ ఏడాది ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

అప్పట్నుంచి ఇప్పటివరకు ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు సేవలందిస్తున్నాడు. తన కెరీర్‌లో 153 వన్డేలు, 110 టీ20లు, 3 టెస్టులు ఆడిన అతడు ఆల్‌రౌండర్‌గా విజయవంతమైన కెరీర్‌ను ముగించాడు. టెస్టులలో 258 పరుగులు చేసిన ఒబ్రెయిన్.. వన్డేలలో 3,619, పొట్టి ఫార్మాట్‌లో 1,973 పరుగులు చేశాడు. వన్డేలలో రెండు సెంచరీలు చేసిన అతడు.. టీ20లలో కూడా ఓ సెంచరీ సాధించడం గమనార్హం. బ్యాటర్ గానే బౌలర్‌గా సేవలందించిన అతడు.. వన్డేలలో 114, టీ20లలో 58 వికెట్లు పడగొట్టాడు.

వాస్తవానికి ఒబ్రెయిన్.. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత ఆటకు గుడ్ బై చెప్దామని అనుకున్నాడు. కానీ గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ తర్వాత అతడికి జట్టులో చోటు దక్కడం లేదు. సెలక్టర్లు 38 ఏళ్ల ఒబ్రెయిన్‌ను కావాలనే పక్కనబెడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన అతడు.. రిటైర్మెంట్ ప్రకటించి శాశ్వతంగా ఆటకు దూరమయ్యాడు. గతేడాది ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో ఆడిన మ్యాచ్ అతడి చివరి మ్యాచ్ అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles