Dhoni steps down as CSK captain ahead of IPL 2022 సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలను విడిచిన ఎంఎస్ ధోని

Dhoni steps down as chennai super kings captain ahead of ipl 2022

mahendra singh dhoni, ravindrasinh anirudhsinh jadeja, indian premier league 2022, ms dhoni, chennai super kings, ipl 2022, MS Dhoni resigns as CSK captain, ms dhoni resigns, chennai super kings captain, Ravindra Jadeja, indian premier league 2022, sports news, cricket news, sports, cricket

Mahendra Singh Dhoni handed over the captaincy of Chennai Super Kings to Ravindra Jadeja ahead of IPL 2022, beginning on Saturday. "MS Dhoni has decided to hand over the leadership of Chennai Super Kings and picked Ravindra Jadeja to lead the team. Jadeja, who has been an integral part of Chennai Super Kings since 2012, will only be the third player to lead CSK," said CSK in a statement.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పగ్గాలను వదులుకున్న మిస్టర్ కూల్

Posted: 03/24/2022 09:34 PM IST
Dhoni steps down as chennai super kings captain ahead of ipl 2022

ఐపీఎల్ 2022 ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. చెన్నై జట్టుకు హాట్ ఫేవరెట్ గా గత పుష్కర కాలం నుంచి నిలుపుతున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ధోనీ ఇవాళ వెల్లడించాడు. ఈ మేరకు ధోని నిర్ణయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. 2008 నుంచి సీఎస్‌కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకూ చెన్నై జట్టుకు నాలుగు సార్లు ఐపీఎల్ కప్ అందించిన ధోనీ షాకింగ్ నిర్ణయం అభిమానులను షాక్ కు గురిచేసింది.

ఐపీఎల్ 2022 టోర్నీ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు ధోనీ.. తన కెప్టెన్సీ హోదా నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం వారిని నిరుత్సాహానికి గురిచేసింది. అయితే తన స్థానంలో చెన్నై పగ్గాలను అల్ రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించాడు. మార్చి 26న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్ ఓపెనర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై జట్టుకు లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ ఆల్ రౌండర్ జడేజా నాయకత్వం వహించనున్నాడు. ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వాన్ని జడేజాకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు.

జట్టును ముందుకు నడిపించడంలో జడేజాను ఎంచుకున్నాడు ధోని. 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లో అంతర్భాగంగా జడేజా కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించే మూడవ ఆటగాడిగా జడేజా కొనసాగనున్నట్టు చెన్నై అధికారిక ప్రకటనలో తెలిపింది. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ జట్టులో తన ఆటతో ప్రాతినిథ్యాన్ని కొనసాగించనున్నాడు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఎడిషన్‌కు ముందు ధోనీ చెన్నై కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ధోనీ తన సారథ్యంలో ఐపీఎల్ రెండవ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా చెన్నై జట్టుకు 4 టైటిళ్లను అందించాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత ధోనీ ఒక అడుగు దూరంలో ఉన్నాడు. చెన్నై జట్టు 15 ఏళ్ల టోర్నమెంట్ చరిత్రలో ధోని కెప్టెన్సీలో ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పి..  అత్యంత విజయవంతమైన ఐపీఎల్ ఫ్రాంచైజీగా అవతరించింది. కానీ, ప్లేఆఫ్‌లకు అర్హత సాధించడంలో చెన్నై జట్టు ఒకసారి మాత్రమే విఫలమైంది. ధోనీ, సురేశ్ రైనా తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మూడో ఆటగాడిగా జడేజా నిలిచాడు. రవీంద్ర జడేజా 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగంగా ఉన్నాడు. స్టార్ ఆల్ రౌండర్ శ్రీలంకతో జరిగిన మొహాలీ టెస్టులో 175 పరుగులు చేసి 9 వికెట్లు పడగొట్టి జడేజా చరిత్ర సృష్టించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles