Kane Williamson's dismissal triggers controversy బ్యాట్ తో మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సింది: కేన్

Srh vs lsg kane williamson s dismissal on dubious no ball triggers controversy

Kane Williamson, Kane Williamson controversy, Sun Risers Hyderabad, SRH, SRH vs LSG, Lucknow Super Giants (LSG), LSG, KL Rahul, IPL, IPL 2022, cricket news, sports news, sports, cricket

Kane Williamson has been at the centre of a controversy as his dismissal in Sunrisers Hyderabad's previous game against Rajasthan Royals (RR) appeared to be a dubious call, however, his latest dismissal against Lucknow Super Giants (LSG) could spark yet another controversy.

బ్యాట్ తో మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సింది: కేన్ విలియమ్ సన్

Posted: 04/05/2022 04:55 PM IST
Srh vs lsg kane williamson s dismissal on dubious no ball triggers controversy

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దురదృష్టం వెంటాడుతోంది. చేతుల వరకు వచ్చిన విజయాన్ని ఆ జట్టు ఆటగాళ్లే అందుకోలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఐపీఎల్ 22లో రాజస్థాన్ రాయల్స్ తో తొలిమ్యాచ్ ను ఓడిపోయిన సన్ రైజర్స్ రెండో మ్యాచ్ లో వరుసగా ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో జట్టు కెప్టెన్ కేన్ విలయమ్ సస్ స్పందిస్తూ.. తమ జట్టు శుభారంభమే చేసినా.. చివరి వరకు దానిని నిలుపుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు. అయితే గత మ్యాచ్‌తో పోల్చుకుంటే తమ జట్టు ఆటతీరు మెరుగైందని.. తమ జట్టు బౌలర్లు చక్కగా రాణించి బంతితో అద్భుతం చేశారన్నారు.

అయితే రాహుల్, హూడాల భారీ భాగస్వామ్యా​న్ని విడగొట్టి ఉంటే తాము పటిష్ట స్థితిలోనే ఉండేవాళ్లమని.. అలా కాకపోవడంతో తాము ఓటమిని చవిచూశామన్నారు. ఈ క్రెడిట్‌ మొత్తం రాహుల్‌, హుడాకే చెందుతుందన్నారు. తాను ఇంకాస్త మెరుగ్గా ఆడి.. మరిన్ని పరుగులు జోడించి ఉంటే మ్యాచ్ పరిస్థితి మారేదని అభిప్రాయపడ్డారు. తాము చివరి వరకు మ్యాచ్ ను తీసుకువెళ్లినా.. విజయం అందుకోలేక పోయామన్నారు. ‘‘ఈ పిచ్‌పై 170 సవాలుతో కూడిన టార్గెట్‌.. అయినా మేము మా వంతు ప్రయత్నం చేయాల్సింది. పటిష్ట భాగస్వామ్యాలు నెలకొల్పాల్సింది. మా వ్యూహాలు ఫలించలేదు. ఏదేమైనా మా బౌలర్లు మాత్రం అద్భుతంగా బౌల్‌ చేశారు’’ అని కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు.

తాము జట్టులోని బ్యాట్స్ మెన్ బ్యాట్‌తో మరింతగా రాణించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. కాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కేన్ విలియమ్ సన్ ఔట్ అయిన బంతి సందర్భంలో 30 అడుగుల సర్కిల్ బయట ఇద్దరికి బదులు ముగ్గురు పీల్డర్లు ఉన్నారని ఇది నో-బాల్ గా పరిగణించాల్సిన అంపైర్లు కూడా ఆ మేరకు ప్రకటన చేయలేదని ఇప్పటికే ఓ వైపు నెట్టింట్లో చర్చ రసవత్తరంగా సాగుతోంది. అయితే మొత్తానికి సన్‌రైజర్స్‌ మ్యాచ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. విలియమ్సన్‌ బృందం 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

సన్ రైజర్స్ బౌలర్లు రాణించినా.. బ్యాటర్లలో రాహుల్‌ త్రిపాఠి(44), నికోలస్‌ పూరన్‌(34) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోయారు. ఫలితంగా లక్నో విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక సన్‌రైజర్స్‌ చతికిలపడింది. మరోవైపు.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(68), దీపక్‌ హుడా(51) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా లక్నో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన విలియమ్సన్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో 16 బంతులు ఎదుర్కొన్న కేన్‌ మామ 16 పరుగులు చేశాడు. ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kane Williamson  Sun Risers Hyderabad  SRH  SRH vs LSG  Lucknow Super Giants (LSG)  LSG  KL Rahul  IPL  IPL 2022  

Other Articles