Rohit Sharma gets emotional at Mohali మొహాలీలో భావోద్వేగానికి గురైన టీమిండియా సారధి..

Focus on role clarity and bench strength rohit sharma lays out his vision for team india

rohit sharma, rohit sharma cricket, rohit sharma captain, rohit sharma indian captain, india vs sri lanka, india vs west indies, india vs sri lanka series, india vs west indies series, emotional, BCCI TV, Emotional, IND vs SL, Captain Rohit Sharma, Team India captain, sports, cricket, sports news, cricket news

India captain Rohit Sharma was responding after the Mohali Test to a question on R Ashwin often not getting a spot in the playing XI on away tours in recent times. It was a clear line in the sand from the skipper, that he couldn’t comment with any reasonable clarity about such calls that had been made in Kohli’s time.

మొహాలీలో భావోద్వేగానికి గురైన టీమిండియా సారధి రోహిత్ శర్మ..

Posted: 03/08/2022 07:58 PM IST
Focus on role clarity and bench strength rohit sharma lays out his vision for team india

టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ.. కొన్నాళ్ల క్రితం వరకు రో‘హిట్’ క్రికెటర్ గానే తెలుసు. అయితే ఇంతటి టాలెంటెడ్ క్రికెటర్ కూడా ఒకప్పుడు జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది. టీమిండియా జట్టులోకి అరంగేట్రం చేసిన ఆరేళ్ల వరకు పెద్దగా తన మార్కు చూపించలేకపోయాడు. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మాత్రం రోహిత్‌లోని ప్రతిభను గుర్తించాడు. దీంతో రోహిత్ శర్మను టాపార్డర్‌కు ప్రమోట్‌ చేయడంతో అతడి దశ తిరిగింది. చాంపియన్స్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్‌ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా పోయింది.

అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం.. టీమిండియా సారథి అయ్యాడు రోహిత్‌ శర్మ. తొలుత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ చేపట్టిన రోహిత్‌ సారథ్యంలో స్వదేశంలో జరిగిన నాలుగు సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసింది భారత జట్టు. ఇక శ్రీలంకతో సిరీస్‌తో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్‌ శర్మ...తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయంతో రికార్డు సృష్టించాడు. భారత క్రికెట్‌ చరిత్రలో ఇన్నింగ్స్‌ మీద భారీ తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించిన రెండో భారత కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. క్రికెటర్‌ నుంచి కెప్టెన్‌గా రోహిత్‌ ఎదిగిన విధానం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన హిట్‌మ్యాన్‌ గతాన్ని గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. ‘‘నిజాయితీగా చెప్పాలంటే టీమిండియా కెప్టెన్‌ అవుతానని కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు ఇలా భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడం నాకెంతో గర్వకారణం. నాకు దక్కిన గొప్ప గౌరవం ఇది. చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇ​క మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గురించి చెబుతూ.. ‘‘కొంత మందికి మాత్రమే వంద టెస్టులు ఆడే అవకాశం వస్తుంది. ఈ ఛాన్స్‌ విరాట్‌కు దక్కింది. అతడి కెరీర్‌లో ఈ మ్యాచ్‌ మైలురాయిగా నిలిచిపోయింది’’ అంటూ సహచర ఆటగాడిపై ప్రశంసలు కురిపించాడు. కాగా టీమిండియా రోహిత్‌ శర్మ టీమిండియాకు 35వ టెస్టు కెప్టెన్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Sharma  emotional  BCCI TV  Emotional  IND vs SL  Captain Rohit Sharma  Team India captain  sports  cricket  

Other Articles