టీమిండియాతో జరిగే మూడు మ్యాచ్ ల టీ20 క్రికెట్ సిరీస్ ప్రారంభమయ్యేందుకు ఒక్కరోజు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ సేనతో ఈ నెల 17 నుంచి తలపడనున్న టీ20 సిరీస్ నుంచి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆదేశ క్రికెట్ బోర్డు తెలిపింది. బుధవారం జైపూర్‌లో తొలి టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. కివీస్ జట్టుకు టీ20 కెప్టెన్‌గా టిమ్ సౌథీ వ్యవహరించనున్నాడు. అయితే టీ-20 సిరీస్ కు దూరంగా వుండనున్న విలియమ్ సన్ టెస్టు సిరీస్ కు మాత్రం అందుబాటులో వుండనున్నాడు.
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ లో తన పూర్తిస్థాయి ప్రదర్శనను ప్రదర్శించిన కేన్ విలియమ్ సన్.. టీ20 సిరీస్ నుంచి విరామం పోందాడు. కాగా, నవంబర్ 25 నుంచి కాన్పూర్‌లో జరగనున్న టెస్టు సిరీస్ కోసం కేన్ విలియమ్‌సన్ ప్రిపేరవుతున్నాడని, దాని కోసమే టీ20 మ్యాచ్‌లకు విలియమ్‌సన్ దూరం అవుతున్నట్లు కివీస్ బోర్డు తెలిపింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు కైల్ జేమిసన్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్‌లు రెండు సిరీస్‌లకు అందబాటులో ఉండనున్నారు. శుక్రవారం రెండవ టీ20 మ్యాచ్ రాంచీలో, ఇక మూడవ మ్యాచ్ కోల్‌కతాలో ఆదివారం జరగనున్నాయి.
కివీస్ టీ20 జట్టు…
టాడ్ ఆస్టిల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మాన్, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్తిల్, కేల్ జేమీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెర్ట్, ఇషా సోదీ, టిమ్ సౌథీ.
Kane Williamson will miss this week’s three-game T20 series against India as he prioritises preparing for the Test series starting on November 25 in Kanpur. #INDvNZ https://t.co/zff00W47ER
— BLACKCAPS (@BLACKCAPS) November 16, 2021
(And get your daily news straight to your inbox)
Jul 02 | ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్ లో రికార్డు అనగానే ఆయన తీసిన వికెట్ల సంఖ్య లెక్కకట్టడం ఆపండీ.. అసలు మ్యాటర్... Read more
Jun 11 | ఐపీఎల్ 2022లో మెరిసిన టాలెండెడ్ ఇండియన్ యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలోనూ మెరుగ్గా రాణించి.. ఏకంగా టీమిండియా సెలక్టర్ దృష్టిలో పడిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడంలో సందేహమే లేదు.... Read more
Jun 11 | క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు ఆటగాళ్లు పాల్పడిన నేపథ్యంలో వారి జట్టు సారధి వారిని వారించి.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తాడు. అయితే కంచే చేసు మేసినట్లు..... Read more
Jun 11 | వరుస గాయాలు, పనితీరులో వైఫల్యంతో టీమిండియా జట్టుకు కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకోవడం తెలిసిందే. దీనిపై పాండ్యా తాజాగా స్పందించాడు. జట్టుకు దూరమైనప్పుడు... Read more
Jun 11 | న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచ్చెల్ తాను మైదానంలో ప్రత్యర్థి జట్టుతో క్రికెట్ అడుతుండగా.. అదే మైదానం నుంచి క్రికెట్ వీక్షిస్తున్న అభిమాని బీర్ తాగుతుండటంతో ఆయన చీర్స్ చెప్పాడు. అదేంటి మైదనంలో క్రికెట్ అడుతున్న... Read more