Sachin Tendulkar Congratulate New Zealand టీమిండియా ఓటమికి విరాట్, పూజారాలే కారణం: సచిన్

Sachin tendulkar congratulate new zealand for icc title win vs india

India, New Zealand, Virat Kohli, Kane Stuart Williamson, Virender Sehwag, Sachin Ramesh Tendulkar, VVS Laxman, Brendon McCullum, ICC World Test Championship 2021, India vs New Zealand, Virat Kohli, Cheteshwar Pujara, Sachin Tendulkar, ICC World Test Championship final,sports, sports news, Cricket news, Cricket

"Congrats @BLACKCAPS on winning the #WTC21. You were the superior team. #TeamIndia will be disappointed with their performance. As I had mentioned the first 10 overs will be crucial & Flag of India lost both Kohli & Pujara in the space of 10 balls & that put a lot of pressure on the team," tweeted Tendulkar.

టీమిండియా ఓటమికి విరాట్, పూజారాలే కారణం: సచిన్

Posted: 06/25/2021 06:56 PM IST
Sachin tendulkar congratulate new zealand for icc title win vs india

ప్రపంచ టెస్టు చాంఫియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి గల కారణాలను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ విశ్లేషించాడు. ప్రపంచపు తొలి టెస్ట్‌ ఛాంపియన్‌ గా అవతరించిన న్యూజిలాండ్ కు శుభాకాంక్షలు తెలుపుతూనే.. కోహ్లీసేన ఓటమికి గల కారణాన్ని తెలియజేశాడు. రిజర్వ్‌ డే ఆటలో 10 బంతుల వ్యవధిలోనే కెప్టెన్ కోహ్లీ, పుజారాల వికెట్లు కోల్పోవడం భారత ఓటమికి ప్రధాన కారణమని ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డాడు. ఆ ఇద్దరు బాధ్యతాయుతంగా ఆడి ఉంటే భారత్‌ ఓటమి నుంచి తప్పించుకునే అవకాశాలు వుండేవని అన్నారు.

ప్రపంచ టెస్ట్ చాంఫియన్ షివ్ అడుతున్నామని.. దానిని గెలవాలన్న పట్టుదల టీమిండియాలో కనిపించలేదని అన్నారు. దిగ్గజ ఆటగాళ్లైనా కాస్త సమయం వికెట్ల వద్ద నిలిచివుంటే కనీసం డ్రాతోనైనా గట్టెక్కేదని, టీమిండియా ఓటమికి కోహ్లీ, పూజారాలే పరోక్షంగా కారకులయ్యారని తెలిపాడు. చివరి రోజు తొలి 10 ఓవర్ల ఆట చాలా కీలకమని తాను చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించాడు. 10 బంతుల వ్యవధిలో కోహ్లీ, పుజారాల వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు తీవ్ర ఒత్తిడికి లోనైందని సచిన్ ట్వీట్ చేశాడు.

కాగా, ఓవర్‌నైట్‌ స్కోరు 64/2తో రిజర్వ్‌ డే ఆట కొనసాగించిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. రిషబ్‌ పంత్‌ (41) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, సౌతీ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బ కొట్టాడు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. 45.5 ఓవర్లలో 2 వికెట్లక నష్టానికి 140 పరుగులు చేసి, టెస్ట్‌ ఫార్యాట్‌లో జగజ్జేతగా ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో విలియమ్సన్‌ సారధ్యంలోని బ్లాక్‌ క్యాప్స్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుండగా, టీమిండియాపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles