Sam Curran Euro 2020-style run out క్రికెట్ లో ఫుట్ బాల్ షాట్.. బ్యాట్స్ మెన్ ఔట్.!

Sam curran showcases football skills to run out sri lankan batsman

Sam Curran Euro 2020-style run out, Sam Curran Football Skills, Danushka Gunathilaka run out, Sam Curran, Danushka Gunathilaka, Avishka Fernando, Euro 2020-style run out, Football Skills, Run Out, Eng vs SL, sports, Cricket

England all-rounder Sam Curran had put on display his football skills which dismissed Sri Lanka's opening batsman Danushka Gunathilaka in the second T20 international played at Cardiff. It all happened on the third ball of the second over when Sri Lanka's opening pair were on the crease, and they wanted a quick single.

వైరల్ వీడియో: క్రికెట్ లో ఫుట్ బాల్ షాట్.. బ్యాట్స్ మెన్ ఔట్.!

Posted: 06/26/2021 07:49 PM IST
Sam curran showcases football skills to run out sri lankan batsman

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్‌ బౌలర్‌ సామ్‌ కరన్‌ అద్భుత రనౌట్‌తో మెరిశాడు. ఫుట్ బాల్‌ టెక్నిక్ ను ఉపయోగిస్తూ లంక బ్యాట్స్ మన్‌ దనుష్క గుణతిలకను వెనక్కి పంపడం వైరల్ గా మారింది. టాస్‌ గెలిచిన శ్రీలంక ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, దనుష్క గుణతిలకలు ఆరంభించారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో సామ్‌ కరన్‌ వేసిన మూడో బంతిని ఫెర్నాండో షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు తగిలి పిచ్‌పైనే ఉండిపోయింది.

సింగిల్‌కు అవకాశం ఉండడంతో నాన్ స్ట్రైక్‌ ఎండ్ లో ఉన్న గుణతిలక ఫెర్నాండోకు కాల్‌ ఇచ్చాడు. అయితే అప్పటికే కరన్‌ అక్కడే ఉండడంతో రెప్పపాటులో ఫుట్ బాల్‌ టెక్నిక్ ను ఉపయోగించి తన కాలితో బంతిని వేగంగా వికెట్ల వైపు తన్నాడు. అంతే.. గుణతిలక క్రీజులోకి చేరుకోకుముందే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో ఇది ఊహించని గుణతిలక భారంగా పెవిలియన్ కు చేరాడు. సామ్‌ కరన్‌ రనౌట్‌ వీడియో ఈసీబీ తన ట్విటర్ లో షేర్‌ చేస్తూ.. ఇట్స్‌ కమింగ్‌ హోమ్‌..  సామ్‌ బ్యాక్‌ ఆన్‌ ది నెట్‌ అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

ఇక ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్‌ ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది.  తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. కుశాల్‌ మెండిస్‌ (39; 3 ఫోర్లు, సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ (2/18), ఆదిల్‌ రషీద్‌ (2/24) రాణించారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో వర్షం రావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 18 ఓవర్లలో 103 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్‌ 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలి చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles