Mandeep Singh first cricketer to support Farmers రైతులకు సంఘీభావం తెలిపిన తొలి క్రికెటర్ ఈయనే.!

Punjab captain mandeep singh first cricketer to support farmers protest

Mandeep Singh, Mandeep Singh cricketer, cricketer Mandeep Singh at Singhu border, farmers protest, Punjab captain Mandeep Singh, farmers protest latest news, sports news, latest sports news, cricket news, sports, cricket

In a first for any national cricketer since the protests by the farmers began against the three farm laws, Punjab captain Mandeep Singh spent a day with the peasants at Singhu border. Mandeep, who had played for Kings XI Punjab in this year’s IPL, reached Delhi with his elder brother Harvinder Singh and three friends.

రైతులకు సంఘీభావం తెలిపిన తొలి క్రికెటర్ ఈయనే.!

Posted: 12/09/2020 03:11 PM IST
Punjab captain mandeep singh first cricketer to support farmers protest

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్ సహా పలువురు క్రీడాకారులు ముందుకు రాగా, తొలిసారిగా దేశంలో అత్యధికమంది ప్రజలు ఆదరించే క్రికెట్ నుంచి టీమిండియా క్రికెటర్, పంజాబ్ క్రికెట్ జట్టు కెప్టెన్ మన్ దీప్ సింగ్ సింఘు చేరకుని రైతులకు తన మద్దతును ప్రకటించారు, రైతులకు మద్దతివ్వడమే కాకుండా.. స్వయంగా వెళ్లి ఆందోళనలో పాల్గొన్నారు. తన సోదరుడు హర్వీందర్‌ సింగ్‌, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన సింఘు సరిహద్దుకు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు.

సోమవారం రోజునే సింఘుకు చేరుకున్న వీరు మంగళవారం సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అన్నదాతలతో పాటు రోడ్డుపై బైఠాయించి నిరసనలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పిన మన్ దీప్‌.. రైతులు లేకపోతే మనకు ఆహారం ఉండదని, త్వరలోనే అన్నదాతల సమస్యలకు పరిష్కారం లభించాలని ఆకాంక్షించారు. ‘ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను చూసి చలించిపోయా. అందుకే వారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఈ మధ్యే నా తండ్రి చనిపోయారు. నాన్న బతికుంటే ఆయన కూడా వచ్చి ఆందోళనలో పాల్గొనేవారు’ అని మన్ దీప్‌ మీడియాతో చెప్పారు.

28ఏళ్ల మన్‌దీప్‌ ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున ఆడాడు. ఆ సమయంలోనే మన్‌దీప్‌ తండ్రి, అథ్లెటిక్స్‌ మాజీ కోచ్‌ హర్‌దేవ్‌ సింగ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. తండ్రి మరణవార్త తెలిసినా.. ఆ బాధను దిగమింగుకుని మ్యాచ్‌ ఆడి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. కాగా.. రైతుల ఆందోళనకు ఇప్పటికే ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ సహా పలువురు క్రీడాప్రముఖులు మద్దతు పలికారు. అన్నదాతలకు మద్దతుగా పంజాబ్‌కు చెందిన కొందరు క్రీడాకారులు తమ పురస్కారాలను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mandeep Singh  cricketer  Singhu border  farmers protest  Punjab captain  Team India  sports  cricket  

Other Articles