సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసిన తరుణంలోనే మరో పరాభవం కూడా ఎదురైంది, టీమిండియా ఆటతీరు ఆలస్యంగా సాగిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారత జట్టుకు జరిమానా విధించింది. స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియాకి ఐసీసీ జరిమానా విధించింది. అయితే మరింతగా పరిస్థితులు మారకుండా, వుండేందుకు భారత క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ ఐసీసీకి క్షమాపణలు చెప్పాడు, బౌలింగ్ చేసే సమయంలో టీమిండియా ఏకంగా నాలుగు గంటల ఆరు నిమిషాల సమయాన్ని తీసుకుంది.
దీంతో ఇంతగా నిదానించిన ఓవర్ రేట్ కు ఫలితంగా జరిమానాను కట్టనుంది. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు రాడ్ టకర్, సామ్, టీవీ అంపైర్ పాల్ రీఫెల్, ఫోర్త్ అంపైర్ గెరార్డ్ అబూద్ ఫిర్యాదు మేరకు ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఐసీసీ ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్దేశించిన సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ పొరపాటుని అంగీకరించడంతో దీనిపై విచారణ అవసరం లేదు’’ అని ఐసీసీ ప్రకటనలో తెలిపింది.
మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ కూడా మైదానంలో ఆట ఆలస్యంగా సాగిందని అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి ఇన్నింగ్స్ లో మొదట కొంత మంది ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. దీనికి కొంత సమయం పట్టింది. నిర్దేశించిన సమయం కంటే భారత్ 45 నిమిషాలు ఎక్కువగా తీసుకుందనిపించింది’’ అని స్మిత్ అన్నాడు. కాగా, సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇదే మైదానంలో రెండో వన్డే ఆదివారం జరగనుంది.
(And get your daily news straight to your inbox)
Dec 16 | బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఓ వివాదంపై స్పందించాడు. ఓ టీ20 మ్యాచ్ లో సహచర ఆటగాడి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్యాచ్... Read more
Dec 10 | కోహ్లీ సేనకు మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జరిమానా విధించింది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం మరోమారు మూడవ.. చివరి టీ20లోనూ టీమిండియా చవిచూడాల్సివచ్చింది. ఈ జరిమానా విధింపుకు ఆసీస్ తో జరిగిన చివరి... Read more
Dec 10 | టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు షాక్ తగిలింది. అసీస్ జట్టులో కీలకమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కానున్నాడు. తొడకండరాల గాయంతో టీమిండియాతో చివరి వన్డే, టీ20 సిరీస్... Read more
Dec 09 | టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికుతున్నట్లు ఇవాళ ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు ఆయనగుడ్ బై... Read more
Dec 09 | కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ గత పక్షం రోజులుగా ఢిల్లీలోని సింఘు సరిహద్దులో రైతులు అందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న బాక్సర్ విజేందర్ సింగ్... Read more