Najeeb Tarakai passes away after accident అప్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఓపెనర్ నజీబ్ మృతి

Afghanistan batsman najeeb tarakai passes away after road accident

Najeeb Tarakai, Afghanistan opener, car accident, Jalalabad car accident, Afghanistani cricketer, Afghanistan Cricket Board, cricket news, sports news, cricket, sports

Najeeb Tarakai, the Afghanistan opener who was badly injured in a fatal car accident in Jalalabad, died today. He was 29. He had sustained severe injuries and was in a coma after the accident.

అప్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఓపెనర్ నజీబ్ మృతి

Posted: 10/06/2020 11:47 PM IST
Afghanistan batsman najeeb tarakai passes away after road accident

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అఫ్ఘానిస్థాన్‌ క్రికెటర్‌ నజీబ్ తరకై (29)‌ చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందాడు. జలాలబాద్ లోని మార్కెట్ కు వెళ్లిన సమయంలో ఆయనను ఓ కారు ప్రమాదవశాత్తూ ఢీ కొట్టింది. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాల కారణంగా ఆయన కోమాలోకి వెళ్లిపోయాడని వైద్యులు ఆ సమయంలో చెప్పారు. ఆయనకు శుక్రవారం నుంచి చికిత్స అందుతోంది. అయితే, అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఈ రోజు తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో... ఆయన మృతి చెందారని ప్రకటించింది. 'దూకుడుగా ఆడే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌, మంచి వ్యక్తి నజీబ్‌ తరకై మృతి పట్ల అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్ బోర్డు, దేశం సంతాపం వ్యక్తం చేస్తోంది.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి ఆయన మనందరిని విషాదంలో ముంచారు. ఆయన పట్ల అల్లా కరుణ చూపాలని కోరుకుంటున్నాము' అని అఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. కాగా, 2014లో ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కెరీర్‌లో మొత్తం 12 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రైట్‌ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ 2017లో గ్రేటర్‌ నోయిడాలో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 90 పరుగులు చేశాడు. టీ20ల్లో ఆయన చేసిన అత్యుత్తమ స్కోరు ఇదే. 2017 మార్చి 24న ఐర్లాండ్‌ లో జరిగిన వన్డే మ్యాచ్‌లోనూ ఆయన ఆడాడు. ఆయన ఆడిన ఏకైక వన్డే మ్యాచ్‌ ఇదే. ఆ మ్యాచ్‌లో ఆయన 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చివరిసారిగా ఆయన గత ఏడాది సెప్టెంబరు 15న బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles