Rohit can have a similar impact like Sehwag: Irfan వీరూ మాదిరిగానే రోహిత్ శర్మ కూడా రాణిస్తాడు: ఇర్ఫాన్ పఠాన్

Rohit sharma can have a similar impact like virender sehwag in test cricket irfan pathan

Rohit Sharma, Irfan pathan, Virender Sehwag, Gautam Gambhir, star sports, cricket connected, Youtube channel, sports news, cricket news, todays cricket score, cricket match, sports, cricket

Former Indian all-rounder Irfan Pathan feels India opener Rohit Sharma can have a similar impact like legendary opener Virender Sehwag in Tests. Irfan Pathan thinks Rohit Sharma's success as an ODI opener can help him achieve greater heights in Tests as well.

వీరేంద్రుడిలానే రోహిత్ శర్మ కూడా రాణిస్తాడు: ఇర్ఫాన్ పఠాన్

Posted: 07/28/2020 11:16 PM IST
Rohit sharma can have a similar impact like virender sehwag in test cricket irfan pathan

టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లో ఎలా రాణిస్తాడు అన్న విషయమై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీమిండియా వన్డేలో రాణిస్తున్న గబ్బర్ శిఖర్ ధావన్.. టెస్టుల్లో మాత్రం అంతగా రాణించలేకపోవడంతో.. అతడ్ని తప్పించిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే వన్డే ఓపెనింగ్ పెయిర్ లో మరో బ్యాట్స్ మన్‌ రోహిత్‌శర్మ టెస్టుల్లో ప్రభావం చూపడంపై చర్చ జరుగుతోంది. అయితే వన్డేల తరహాలోనే రోహిత్ టెస్టుల్లో కూడా వీరేంద్రుడి మాదిరిగానే ప్రభావాన్ని చూపగలడని మాజీ ఓపెనర్, ఎంపీ గతమ్ గంభీర్ అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలతో నర్మగర్భంగా అంగీకరించిన టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం కొద్దిగా వెనకబడతాడని అన్నాడు.

వీరేంద్ర సెహ్వాగ్‌ ఆడినన్ని మ్యాచులు రోహిత్ శర్మ ఆడలేకపోవచ్చని.. ఆడినా.. వీరూ తరహాలో రాణించలేకపోవచ్చునని.. కొంత వెనకంజలోనే నిలుస్తాడని ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. సెహ్వాగ్‌ ఈ ఫార్మాట్‌లో 100 మ్యాచులు ఆడగా రోహిత్‌ అన్ని టెస్టులు ఆడతాడా అనే విషయంపై అనుమానాలు వ్యక్తం చేశాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ యూట్యూబ్‌ ఛానల్ లో గౌతమ్‌ గంభీర్ తో మాట్లాడుతూ ఇర్ఫాన్‌ ఇలా పేర్కొన్నాడు. రోహిత్‌ వన్డేల్లో ఛాంపియన్ గా కొనసాగుతున్నా టెస్టుల్లో  ఆడటంలో వీరూ కన్నా మెరుగ్గా రాణించే విషయం పక్కన బెడితే.. ఆయన చూపినంత ప్రభావం కూడా చూపగలడా అని సందేహాలు వ్యక్తం చేశారు. ఒకవేళ పూర్తి ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటే సెహ్వాగ్‌ వలే ప్రభావం చూపుగలడని అన్నాడు. ఇదివరకే వన్డేలు, టెస్టుల్లో ద్విశతకాలు బాదాడని గుర్తుచేశాడు.

రోహిత్‌ టెస్టు క్రికెట్‌ ఇప్పుడు మారిందని, గతంతో పోలిస్తే చాలా మార్పులొచ్చాయని చెప్పాడు. టెస్టుల్లో అతడు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఉన్నప్పుడు అందరూ ఆశించినంతగా రాణించలేకపోయాడన్నాడు. అంతకుముందు గంభీర్‌ మాట్లాడుతూ సెహ్వాగ్‌ రెండు ఫార్మాట్లలో రాణించాడని, వన్డేల్లో ఎలా ఆడాడో టెస్టుల్లోనూ అలాంటి ప్రదర్శనే చేశాడని చెప్పాడు. అయితే, రోహిత్‌ వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్నా సెహ్వాగ్‌ వలే ప్రభావం చూపుతాడనడంలో సందేహం ఉందన్నాడు. ఇదిలా ఉండగా, హిట్‌మ్యాన్‌ గతేడాదే టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్టు సిరీస్‌లో రెండు శతకాలు, ఒక ద్విశతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే రోజుల్లోనూ అతడు విదేశాల్లో మంచి ప్రదర్శన చేస్తాడని పఠాన్‌ అభిప్రాయపడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles