Yuvraj Singh credits Sachin Tendulkar for his comeback సచిన్ మాటలే నాకు అప్పుడు ప్రేరణ: యువరాజ్ సింగ్

Yuvraj singh credits sachin tendulkar for his comeback in international cricket

Sachin Tendulkar, Yuvraj Singh, Cricket, Cancer, Indian best Allrounder, Indian left handed batsman, Punjabi cricketer, National side, Cricket News, Sports news, sports news, cricket news, todays cricket score, cricket match, sports, cricket

Yuvraj Singh was a prolific cricketer. The left-hander was indeed the best No. 4 for India in ODI cricket. The former all-rounder played numerous memorable innings in his glorious career. Yuvraj recalled the conversations he had with Tendulkar, which helped the Punjabi cricketer to make a comeback in the national side.

సచిన్ మాటలే నాకు అప్పుడు ప్రేరణ: యువరాజ్ సింగ్

Posted: 07/28/2020 10:58 PM IST
Yuvraj singh credits sachin tendulkar for his comeback in international cricket

టీమిండియా వరల్డ్ కప్ హీరోగా ఎవరినైనా ప్రస్తావనకు వస్తే అందులో ప్రముఖంగా వినిపించే పేరు మాత్రం ఆల్ టైమ్‌ ఆల్ రౌండర్ యువరాజ్‌ సింగ్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత్‌ జట్టు 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్ లు గెలిచిందంటే అందులో యువరాజ్ పాత్ర కూడా కీలకమైనదే. అతడి బౌలింగ్, ఫీల్డింగ్ సహా బ్యాటింగ్ గురించి తెలియని భారతీయుడే కాదు.. క్రికెట్ అభిమాని వుండండనే చెప్పాలి. అతడి ఘనకీర్తి విశ్వవ్యాప్తం. ఇక ధోనీసేన వన్డేల్లో రెండోసారి విశ్వవిజేత నిలివడంలోనూ అతని పాత్ర అత్యంత కీలకం. అయితే ఇలా వన్డే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే యవరాజ్ సింగ్ అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలిసిందే.

ప్రత్యర్థి జట్లపై గెలుపే కాదు ప్రాణాంతమైన క్యాన్సర్ వ్యాధిని కూడా జయించాడు యువరాజు. ఈ విషయమై ఓ స్పోర్ట్స్ మ్యాగజీన్ తో పలు ఆసక్తికర విషయాలు ఈ ఎడమ చేతి వాటం గల క్రికెటర్ పంచుకున్నారు. తాను క్యాన్సర్ తో బాధపడుతున్న నాటి పరిస్థితుల్లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ మాటలు ఉపయోగపడ్డాయని చెప్పాడు. తాను నిత్యం సచిన్ టెండుల్కర్ తో మాట్లాడేవాడినని, ఆయన అప్పట్లో చెప్పిన మాటలతోనే తాను మళ్లీ క్రికెట్ ప్రపంచంలోకి అడుగెపెట్టేలా దోహదపడ్డాయని తెలిపాడు. సచిన్ మాటలతోనే తాను ఎంతో ప్రేరణ పోందానని కూడా అన్నారు యువరాజ్.

క్యాన్సర్‌ నుంచి కోలుకున్నాక మళ్లీ దేశవాళి క్రికెట్ లో ఆడాల్సివచ్చినప్పుడు తన కెరీర్‌ ఒడుదొడుకుల్లో సాగిందని అన్నాడు యువీ. దాంతో ఈ పరిస్థితులను ఎదుర్కోనడానికి సచిన్ తో మాట్లాడానని అన్నాడు. తమ సంభాషణలో సచిన్ తనకు కొన్ని ప్రశ్నలు వేశాడని, ‘మనమెందుకు క్రికెట్‌ ఆడతాం? ఆటపై ఉన్న ప్రేమతోనే ఆడాలనుకుంటాం. క్రికెట్‌ ను ప్రేమిస్తే.. నీకు ఆడాలనిపిస్తుంది. ఒకవేళ ఇదే పరిస్థితిలో నేనుంటే నాకు కూడా ఏం చేయాలో తెలియకపోవచ్చు. కానీ ఆటమీద నీకు ఇష్టముంటే ఆడుతూనే ఉండు. అలాగే నీకు ఇష్టమొచ్చినప్పుడే రిటైరవ్వు. అది ఇతరులు నిర్ణయించకూడదు’ అని తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు. అవి తనకు స్పూర్తిని కలిగించాయన్నాడు. వాటితో తాను మరో నాలుగైదు ఏళ్ల పాటు క్రికెట్ అడానని తెలిపాడు యువీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles