BCCI officially suspends IPL 2020 till further notice తదుపరి అదేశాలు ఇచ్చే వరకు ఐపీఎల్ వాయిదా: బిసిసిఐ

It s official bcci confirms ipl suspended until further notice

Suresh Raina, MS Dhoni, ipl 2020, ipl news, sri lanka cricket, sri lanka ipl, ipl venue, ipl host country, ipl sri lanka, bcci, india premier league, Chennai Super Kings (CSK), COVID-19 pandemic, Indian Premier League (IPL), Instagram, Sourav Ganguly, cricket score, cricket news, Cricket, sports

Indian Premier League (IPL) was officially postponed until further notice because of the Covid-19 pandemic on Thursday but the Indian cricket board believes it can find a "safe" window later for the lucrative Twenty20 tournament.

తదుపరి అదేశాలు ఇచ్చే వరకు ఐపీఎల్ వాయిదా: బిసిసిఐ

Posted: 04/16/2020 09:51 PM IST
It s official bcci confirms ipl suspended until further notice

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఐపీఎల్ తాజా సీజన్ పై నీలిమబ్బులు కమ్ముకుంటున్నాయి. ఈ సీజన్‌ను రద్దు చేయక తప్పని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడగించారు. కరోనా మహమ్మారిని దేశం నుంచి శాశ్వతంగా పారద్రోలే క్రమంలో లాక్ డౌన్ కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎత్తివేయకుండా అంచెలవారీగా ఎత్తివేస్తారన్న సంకేతాలను ఇప్పటికే కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు భారీస్థాయిలో జనసమీకరణలు జరిగే ప్రాంతాల్లపై లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా అంక్షలు కొనసాగే అవకాశాలున్నాయన్నవార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. తాము తదుపరి నోటీసులు జారీ చేసేంత వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)ను వాయిదా వేస్తున్నామని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ వుంటుందా.? అన్న అభిమానుల ప్రశ్నలు కూడా ఉవ్వెత్తున్న వినిపిస్తున్నాయి, ‘కొవిడ్‌ వైరస్ ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈ నేపథ్యంలో మళ్లీ నోటీసులు జారీ చేసేంతవరకు ఐపీఎల్‌-2020ని వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది’ అని బోర్డు కార్యదర్శి జే షా ప్రకటించారు.

దేశంలో క్రికెట్‌ను ఎప్పుడు పునరుద్ధరిస్తారని ప్రశ్నించగా ‘ఎప్పుడు ఆరంభించాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర సంఘాలతో కలిసి బీసీసీఐ నిరంతరం సమీక్షిస్తుంది. ఆ తర్వాతే నిర్ణయం ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. మొదట ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేశారు. లాక్‌డౌన్‌ను పొడగించడంతో మళ్లీ నోటీసులు ఇచ్చేంతవరకు సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐకి సెప్టెంబర్‌-నవంబర్‌ విండో మాత్రమే మిగిలింది. అప్పుడు సీజన్‌ను ఆరంభించాలన్నా దుబాయ్‌లో ఆసియా కప్‌కు దూరమవ్వాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles