Shoaib Akhtar Requests India To Provide 10,000 Ventilators కరోనా కల్లోలం: అవిస్తే భారత్ మేలు మర్చిపోం: అక్తర్

Shoaib akhtar requests india to provide 10 000 ventilators for struggling pakistan

shoaib akhtar, coronavirus, yuvraj singh, harbhajan singh, shahid afridi, India, Pakistan, Ventilators, Cricket, sports

Former Pakistan cricketer Shoaib Akhtar recently opined that India and Pakistan must help each other during these tough times that the world is suffering from. Akhtar emphasised on how the coronavirus pandemic can only be beaten if both countries join hands.

కరోనా కల్లోలం: అవిస్తే భారత్ మేలు మర్చిపోం: అక్తర్

Posted: 04/09/2020 08:46 PM IST
Shoaib akhtar requests india to provide 10 000 ventilators for struggling pakistan

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. పలు దేశాల్లో సరైన వ్యక్తిగత రక్షణ తొడుగులు లేకపోవడంతో వైరస్‌ సోకిన వారికి చికిత్స చేస్తోన్న వైద్యులు కూడా దాని కోరల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో వెంటిలేటర్ల కొరతపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ స్పందించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వెంటిలేటర్లు ఇచ్చి భారత్ తమ దేశాన్ని ఆదుకోవాలని కోరారు. ఇరు దేశాల మధ్య ఉన్న తేడాలను మర్చిపోయి సాయం చేస్తే పాకిస్థాన్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. పాకిస్థాన్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరగడమే ఆ అభ్యర్థనకు కారణం. ఇప్పటివరకు అక్కడ 4వేలకు పైబడి కేసులు నమోదయ్యాయి.

దీనికి సంబంధించి అక్తర్ ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ..‘భారత్ మాకు 10వేల వెంటిలేటర్లు అందిస్తే ఆ సహాయాన్ని పాకిస్థాన్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. అయితే మేం మ్యాచ్‌ల గురించి మాత్రమే మాట్లాడగలం. మిగతాదంతా అధికారిక సంస్థలే నిర్ణయిస్తాయి’ అని వెల్లడించారు. పాకిస్థాన్‌లో కరోనా వైరస్‌ కట్టడికి తన ఛారిటీ సంస్థ ద్వారా అక్తర్ సహకారం అందిస్తున్నారు. ఆ సంస్థకు భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్‌ సింగ్ విరాళాలు ఇచ్చారు. దాంతో వారిద్దరిపై నెట్టింట్లో వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. దానిపై అక్తర్ నెటిజన్ల విమర్శలకు బదులిచ్చారు. ‘వారిని విమర్శించడం దారుణం. వారి విరాళాలు ఒక దేశానికి, మతానికి ఇచ్చినవి కావు. అది మానవత్వానికి సంబంధించిన అంశం’ అని వారి ప్రయత్నానికి మద్దతు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shoaib akhtar  coronavirus  yuvraj singh  harbhajan singh  shahid afridi  India  Pakistan  Ventilators  Cricket  sports  

Other Articles