Kapil Dev responds to Shoaib Akhtar's proposal షోయబ్ అక్తర్ ప్రతిపాదనకు ఘాటు కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్

We don t need to raise money kapil dev responds to shoaib akhtar s proposal

Kapil Dev, Shoaib Akhtar, Coronavirus outbreak, India vs Pakistan ODI series, Akhtars proposal, India vs pakistan match, ind vs pak match, cricket match, today cricket match, cricket score, cricket news, cricket, sports news, sports

The legendary Kapil Dev slammed Shoaib Akhtar's idea of a made-for-television three-match ODI series between India and Pakistan to raise funds for the COVID-19 pandemic, saying "India doesn't need the money" and it is not worth risking lives for a cricket match.

షోయబ్ అక్తర్ ప్రతిపాదనకు ఘాటు కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్

Posted: 04/09/2020 09:49 PM IST
We don t need to raise money kapil dev responds to shoaib akhtar s proposal

కరోనావైరస్‌పై పోరాటం చేసేందుకు కావాల్సిన నిధులకోసం భారత్‌ పాక్ దేశాలమ తో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడాల్సిన గత్యంతరం పట్టలేదని కపిల్‌ ఘాటుగా స్పందించారు.దాయాదిదేశాల్లో కరోనాపై పోరాడేందుకు అవసరమైన నిధులకోసం ప్రేక్షకులు స్టేడియానికి రాకుండా భారత్‌-పాక్‌ మధ్య మూడువన్డేల ద్వైపాక్షికసిరీస్‌ను ఏర్పాటు చేయాలని షోయబ్‌అక్తర్‌ బుధవారం తన అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై మాజీ లెజండరీ క్రికెటర్‌ స్పందిస్తూ.. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు భారత్‌ వద్ద పెద్దమొత్తంలో నిధులున్నాయ, క్రికెట్‌మ్యాచ్‌లు అవసరం లేదని పాక్‌ మాజీ క్రికెటర్‌ అక్తర్‌కు చురకలంటించాడు. అక్తర్‌ తన స్వంత అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని, కానీ ఇప్పటిపరిస్థితుల్లో ఇది ఏమాత్రం సమంజసం కాదని కపిల్‌ అన్నారు. ప్రస్తుతం ఈ మహమ్మారిని ఎదుర్కొవడమనేది రెండుదేశాల ప్రభుత్వాలు పరస్పరం ఎలా సహకరించుకుంటున్నాయి.. అన్నదానిపై ఆధారపడిఉంటుందన్నారు. కానీ కొంతమంది ఇప్పటికీ వార్తా ఛానెళ్లలో కూర్చుని ఒకరినొకరు విమర్శించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనాపై పోరులో ప్రభుత్వానికి అండగా ఉండేందకు ఇప్పటికే బీసీసీఐ పెద్దమొత్తంగా రూ.51 కోట్లరూపాయలను విరాళంగా ఇచ్చిందన్నారు. ఇంకా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.ఈ విపత్కర పరిస్థితుల్లో క్రికెట్‌ ఆడించి తమ క్రికెటర్లను ఇబ్బందుల్లో పడేసే ఉద్దేశం తమకు లేదన్నారు. వచ్చే ఆరునెలల వరకు క్రికెట్‌మ్యాచ్‌ల గురించి ఆలోచించకుండా ఉంటేనే మంచిదన్నారు. ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు ఇతర దేశాలకు సాయం చేసేందుకు భారత్‌ ఎప్పుడూ ముందుంటుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles