India Beat Australia In World Cup Opener మహిళల టీ-20లో భారత్ శుభారంభం..

Poonam yadav s magical spell helps india beat australia in women s t20 world cup

Harmanpreet Kaur, women’s T20 World Cup, Australia, Team India, india women, australia women, poonam yadav, deepti sharma, harmanpreet kaur bhullar, alyssa healy, womens t20 world cup 2020, australia women vs india women, cricket results, cricket news, cricket news liveCricket, Sports, sports news, cricket news, latest cricket news

Leg-spinner Poonam Yadav bowled a magical spell in her comeback game to steer India to a comfortable 17-run win over defending champions Australia in the opening match of the Women's T20 World Cup at the Sydney Showground Stadium on Friday.

మహిళల టీ-20లో భారత్ శుభారంభం.. అసీస్ పై గెలుపు

Posted: 02/21/2020 07:51 PM IST
Poonam yadav s magical spell helps india beat australia in women s t20 world cup

ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు శుభారంభం చేసింది. హాట్ ఫేవరెట్ జట్టైన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును స్వదేశంలోనే చిత్తుచేసింది. మహిళల టీ-20 ఆరంభపు మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసి 132 పరుగులే చేసినా, దాన్ని కాపాడుకుని చిరస్మరణీయమైన గెలుపును అందుకుంది.  ఆసీస్‌ను తన స్పిన్‌ మ్యాజిక్‌తో పూనమ్‌ యాదవ్‌ హడలెత్తించింది. పూనమ్‌ యాదవ్‌ బౌలింగ్‌ దెబ్బకు ఆసీస్‌ దాసోహమైంది. ఆమె బౌలింగ్‌లో ఎదురుదాడి చేయడాన్ని పక్కన పెడితే అసలు వికెట్లను ఎలా కాపాడుకోవాలో తెలియక నానా తంటాలు పడింది.

పూనమ్‌ నాలుగు ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి నాలుగు కీలక వికెట్లను సాధించి భారత్‌ విజయంలో ముఖ్య భూమిక పోషించింది.  ఓపెనర్‌ అలైసా హీలే(51), రాచెల్‌ హెయిన్స్‌(6), ఎలీసె పెర్రీ(0), జొనాసెన్‌(2)లను స్వల్ప విరామాల్లో ఔట్‌ చేసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. పూనమ్‌కు జతగా పేసర్‌ శిఖా పాండే మూడు వికెట్లు సాధించగా, రాజేశ్వరి గైక్వాడ్‌కు వికెట్‌  దక్కింది. మరో ఇద్దరు రనౌట్‌  కావడంతో ఆసీస్‌ 19.5 ఓవర్లలో 115 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది.

అంతకుముందు భారత జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. దీప్తి శర్మ(49 నాటౌట్‌; 46 బంతుల్లో 3 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడగా, షెఫాలీ వర్మ(29; 15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడింది. జెమీయా రోడ్రిగ్స్‌(26)లు ఫర్వాలేదనిసించింది. దీంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరును చేసింది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన మంధాన, షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. షెఫాలీ వర్మ ధాటిగా ఆడటంతో స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది.

భారత్ స్కోరు 4 ఓవర్లలో 41 పరుగుల వద్దనుండగా.. జోనాసెన్‌ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అనంతరం క్రమంగా వికెట్లు పడ్డాయి. పెర్రీ బౌలింగ్ లో షెఫాలీ వర్మ క్యాచ్ ఇచ్చి వెనుదిరుగగా, జోనాసెన్‌ వేసిన ఏడో ఓవర్‌ కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ స్టంపౌట్ గా వెనుదిరిగింది, కాగా, రోడ్రిగ్స్‌- దీప్తి శర్మల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 53 పరుగులు జోడించిన తర్వాత రోడ్రిగ్స్‌ వెనుదిరిగింది. కిమ్మిన్సె వేసిన 16 ఓవర్‌ ఆఖరి బంతికి వికెట్లు ముందు దొరికిపోయింది. దాంతో భారత స్కోరు 100 పరుగుల వద్ద ఉండగా నాల్గో వికెట్‌ను కోల్పోయింది. కాగా, దీప్తి శర్మ స్టైక్‌ రొటేట్‌ చేస్తూ కుదురుగా ఆడి అజేయంగా నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Ganguly says entire system helped chappell drop him from indian team

  అంతా కలిసే నన్ను అన్యాయంగా తప్పించారు: సౌరవ్ గంగూలీ

  Jul 12 | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరవ్ గంగూలీ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థించగా, మరికోందరు వ్యతిరేకించారు. ఈ విషయాన్ని... Read more

 • Tendulkars knock in chennai higher than sehwags 309 saqlain mushtaq

  ‘‘వీరూ ట్రిపుల్ సెంచరీ కన్నా టెండుల్కర్ శతకం మిన్నా’’

  Jul 12 | భారత జట్టులో అటు టెస్టు కానీ ఇటు పరిమిత ఓవర్లు మ్యాచుల్లో కానీ సచిన్ టెండుల్కర్ అనగానే క్రికెట్ దేవుడిగా కోలిచేవారి సంఖ్య అధికం. ఇక మాజీ ఇండియన్ టీమ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర... Read more

 • Yuvraj singh maafi maango trends on twitter for making casteist remark on chahal

  యువరాజ్ సింగ్ పై పోలీసు కేసు.. అరెస్టుకు అవకాశం..

  Jun 05 | టీమీండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గత కొన్నాళ్లుగా యువీ టైం బాగోలేదనుకుంటా.. అయితే సమయం కలసిరాని సందర్భాల్లో సంయమనం పాటిస్తూ మౌనంగా వుండాలే తప్ప.. సరదా కోసం కూడా... Read more

 • Sri lanka cricket says 3 former players in icc graft probe

  ముగ్గురు శ్రీలంక ఆటగాళ్ల మ్యాచ్ ఫిక్సింగ్ పై ఐసిసి విచారణ

  Jun 05 | క్రికెట్ ప్రపంచాన్ని ఫిక్సింగ్ భూతం పట్టిపీడిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రజల అభిమాన క్రీడా క్రికెట్ ను ఫిక్సింగ్ మాఫియా తమ కబంధ హస్తాలలోకి తీసుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంది. అంతర్జాతీయ... Read more

 • Suresh raina on ms dhonis tireless training in csks camp

  రైనా చూసిన మహిభాయ్ విభిన్న సాధన

  Jun 04 | టీమిండియా మాజీ సారధి, వికెట్ కీపర్, మిస్టర్ కూల్ ధోని రిటైర్మెంట్ పై వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆయన ఎంతలా కష్టపడుతున్నారు.. అందుకు ఎలా సన్నధమవుతున్నారో చెప్పుకోచ్చాడు టీమిండియా మాజీ ఆటగాడు చెన్నై సూపర్... Read more

Today on Telugu Wishesh