ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో కివీస్ ఆటగాడు హెన్రీ నికోలస్ అద్భుతమైన రీతిలో క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్ వాగ్నెర్ వేసిన బౌన్సర్‌ను డిఫెండ్ ఆడటానికి ప్రయత్నించిన ఆసీస్ ఆటగాడు స్టీవ్‌స్మిత్.. నికోలస్‌కు క్యాచ్ ఇచ్చాడు. నికోలస్ వెనక్కి దూకుతూ బంతిని ఒంటి చేత్తితో అద్భుతంగా అందుకున్నాడు. క్యాచ్ పట్టిన తర్వాత కిందపడకుండా తనని తాను నియంత్రించుకున్న తీరు అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఈ వీడియోను ఐసీసీ ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ క్యాచ్‌కు మీరు ఎంత రేంటింగ్ ఇస్తార’ని నెటిజన్లను ప్రశ్నించింది.
దీంతో అందరూ పదికి పది అంటూ కామెంట్ల జల్లు కురిపిస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులకు ఆలౌటైంది. హెడ్ (114) శతకం బాదగా స్టీవ్ స్మిత్ (85), టిమ్ పైన్ (79) అర్ధశతకాలు చేశారు. కివీస్ బౌలర్లలో వాగ్నెర్ (4/83), టిమ్ సౌథి (3/103), గ్రాండ్‌హోమ్ (2/68) రాణించారు. తొలి టెస్టులో కివీస్‌పై ఆసీస్ 296 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Jul 02 | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్ లో రికార్డు అనగానే ఆయన తీసిన వికెట్ల సంఖ్య లెక్కకట్టడం ఆపండీ.. అసలు మ్యాటర్... Read more
Jun 11 | ఐపీఎల్ 2022లో మెరిసిన టాలెండెడ్ ఇండియన్ యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలోనూ మెరుగ్గా రాణించి.. ఏకంగా టీమిండియా సెలక్టర్ దృష్టిలో పడిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడంలో సందేహమే లేదు.... Read more
Jun 11 | క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు ఆటగాళ్లు పాల్పడిన నేపథ్యంలో వారి జట్టు సారధి వారిని వారించి.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తాడు. అయితే కంచే చేసు మేసినట్లు..... Read more
Jun 11 | వరుస గాయాలు, పనితీరులో వైఫల్యంతో టీమిండియా జట్టుకు కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకోవడం తెలిసిందే. దీనిపై పాండ్యా తాజాగా స్పందించాడు. జట్టుకు దూరమైనప్పుడు... Read more
Jun 11 | న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచ్చెల్ తాను మైదానంలో ప్రత్యర్థి జట్టుతో క్రికెట్ అడుతుండగా.. అదే మైదానం నుంచి క్రికెట్ వీక్షిస్తున్న అభిమాని బీర్ తాగుతుండటంతో ఆయన చీర్స్ చెప్పాడు. అదేంటి మైదనంలో క్రికెట్ అడుతున్న... Read more